Realme C35 ఇండియా లాంచ్ మార్చి 7న జరగనున్నది! ధరలు, స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి...

|

చైనీస్ స్మార్ట్‌ఫోన్ టెక్ దిగ్గజం రియల్‌మి సంస్థ గత నెలలో థాయ్‌లాండ్‌లో ప్రారంభించిన రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ ను ఇండియాలో తన యొక్క పోర్ట్ పోలియోలో లాంచ్ చేయనున్న తేదీని మార్చి 7గా నిర్ణయించినట్లు నేడు ప్రకటించింది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు వాటర్‌డ్రాప్ నాచ్‌తో ఫుల్-హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే తక్కువ మొత్తంలో బ్యాటరీ యొక్క ఛార్జింగ్ ఉన్నప్పుడు వినియోగదారులు హ్యాండ్‌సెట్ అధిక సమయం ఉపయోగించడానికి వీలుగా అనుమతించే సూపర్ పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుందని రియల్‌మి సంస్థ వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి

రియల్‌మి నుండి ఒక వచ్చిన ఒక ప్రకటన ప్రకారం రియల్‌మి C35 ఫోన్ మార్చి 7 న మధ్యాహ్నం 12.30 గంటలకు భారతదేశంలో ప్రారంభించబడుతుంది. కంపెనీ స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా టీజ్ చేసింది. ఇది 6.6-అంగుళాల ఫుల్-HD డిస్ప్లే ను 1,080x2,408 పిక్సెల్‌లతో వస్తుంది. ఇది 90.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే ఇది సూపర్ పవర్ సేవింగ్ మోడ్‌ను కలిగి ఉన్నట్లు కూడా టీజ్ చేసింది. ఇది ఫోన్ యొక్క బ్యాటరీ జీవితాన్ని పొడిగించగలదని మరియు 18W శీఘ్ర ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఇంకా ఫోన్ పవర్ బటన్‌లో పొందుపరిచిన సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

రియల్‌మి C35 అంచనా ధరల వివరాలు

రియల్‌మి C35 అంచనా ధరల వివరాలు

రియల్‌మి సంస్థ భారతదేశంలో రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ ను ధరను వెల్లడించనప్పటికీ ఇది థాయిలాండ్‌లో THB 5,799 ధర వద్ద లాంచ్ అయింది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని యొక్క విలువ దాదాపు రూ.13,350 ప్రారంభ ధరతో ప్రారంభించనున్నది. ఇండియాలో కూడా ఇదే ధర రేంజ్‌లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
 

రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే భారతీయ వేరియంట్ థాయ్‌లాండ్‌లో అరంగేట్రం చేసిన దానికంటే భిన్నంగా ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు. రియల్‌మి నేడు వెల్లడించిన ముఖ్యమైన ఫీచర్లలో భారతీయ వెర్షన్ థాయ్‌లాండ్ మోడల్‌కు సమానంగా ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారంగా రియల్‌మి UI R ఎడిషన్‌ను అమలు చేస్తుందని అంచనా వేయబడింది. అలాగే ఇది గరిష్టంగా 6GB వరకు LPDDR4X RAMతో జత చేయబడిన octa-core Unisoc T616 SoCని పొందే అవకాశం ఉంది.

ఫోటోగ్రఫీ

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే రియల్‌మి C35 వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. థాయిలాండ్ వేరియంట్ f/1.8 అపెర్చర్ 5P లెన్స్, మాక్రో కెమెరా మరియు బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్ కెమెరాతో జత చేయబడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో f/2.0 ఎపర్చరు లెన్స్‌తో జత చేయబడిన 8-మెగాపిక్సెల్ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇది 128GB వరకు UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించే అవకాశం ఉంది. చివరిగా 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Realme C35 India Launch Set on March 7!! Prices and Specifications Leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X