రియల్‌మి C35 6GB ర్యామ్ కొత్త మోడల్ లాంచ్ సేల్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్...

|

చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి ఇటీవల ఇండియాలో రియల్‌మి C35 మోడల్ ను రెండు వేరియంట్ లలో లాంచ్ చేసింది. అయితే నేడు దీని యొక్క ర్యామ్ కొనసాగింపుగా మరొక వేరియంట్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ కొత్త మోడల్ 6GB ర్యామ్ +128GB స్టోరేజ్ ఆప్షన్‌లో వస్తుంది. రియల్‌మి C35 ఫోన్ యొక్క 6GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ముందు లాంచ్ అయిన మోడల్‌ల మాదిరిగానే దాదాపు అదే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేను మరియు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి C35 కొత్త మోడల్ ధరలు & లాంచ్ డిస్కౌంట్ ఆఫర్స్

రియల్‌మి C35 కొత్త మోడల్ ధరలు & లాంచ్ డిస్కౌంట్ ఆఫర్స్

రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో గత నెలలో 4GB RAM + 64GB స్టోరేజ్ మరియు 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వంటి రెండు వేరియంట్లలో వరుసగా రూ.11,999 మరియు రూ.12,999 ధరల వద్ద గ్లోయింగ్ బ్లాక్ మరియు గ్లోయింగ్ గ్రీన్ కలర్ లలో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా 6GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ని రూ.15,999 ధర వద్ద లాంచ్ చేసింది. ఇది ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. నేడు 6GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ని కొనుగోలు చేసిన వారు రూ.13,999 ధర వద్దనే కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11లో రియల్‌మి UI R ఎడిషన్‌తో రన్ అవుతుంది. అలాగే ఇది 90.7 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద ఫోన్ స్టాండర్డ్‌గా 4GB LPDDR4X RAMతో పాటు octa-core Unisoc T616 SoCని కలిగి ఉంది.

ఫోటోగ్రఫీ
 

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే రియల్‌మి C35 వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ F/1.8 లెన్స్‌తో పాటు Realme GT 2లో లభించే అదే 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు f/2.8 లెన్స్‌తో మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.0 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ Sony IMX355 సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 128GB వరకు ఆన్‌బోర్డ్ UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరణకు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది.

రియల్‌మి C30

రియల్‌మి C30

రియల్‌మి చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ ఇటీవల కొత్తగా ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేసింది. రియల్‌మి C30 పేరుతో విడుదలైన ఈ కొత్త ఫోన్‌ రియల్‌మి బ్రాండ్ యొక్క బడ్జెట్ విభాగంలో రెండు వేరియంట్‌లలో విడుదలై ఇప్పటికే ఉన్న C-సిరీస్‌లోని రియల్‌మి C31, రియల్‌మి C35 మరియు రియల్‌మి C11 2021 వంటి స్మార్ట్‌ఫోన్‌ల జతలో చేరింది. ఇందులో 2GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.7,499 కాగా 3GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.8,299. ఇది UniSoC T612 సిస్టమ్-ఆన్-చిప్, 6.5-ఇంచ్ డిస్ప్లే, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో లాంచ్ అయింది.

రియల్‌మి C30 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C30 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C30 స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.5-అంగుళాల డిస్ప్లేను 88.7 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో మరియు 16.7 మిలియన్ కలర్స్‌తో వస్తుంది. ఇది వర్టికల్ స్ట్రిప్ డిజైన్‌ను కలిగి ఉండి 8.5mm మందంతో మరియు 182 గ్రాముల బరువుతో బ్యాంబూ గ్రీన్ మరియు లేక్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది UniSoC T612 సిస్టమ్-ఆన్-చిప్ ద్వారా ఆధారితమై 32GB UFS 2.2 ఇంటర్నల్‌ స్టోరేజ్ స్పేస్‌తో జత చేయబడి వస్తుంది. ఇది 2GB మరియు 3GB RAM వేరియంట్లలో లభిస్తుంది. ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 11 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన రియల్‌మి గో ఎడిషన్ UIతో రన్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Realme C35 Smartphone 6GB RAM New Variant Launched in India: Price, Today Sale Discount Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X