Home
News

రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

చైనీస్ స్మార్ట్‌ఫోన్ టెక్ దిగ్గజం రియల్‌మి సంస్థ గత నెలలో థాయ్‌లాండ్‌లో ప్రారంభించిన రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ ను నేడు ఇండియాలో బడ్జెట్ మోడల్‌ విభాగంలో లాంచ్ చేసింది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా, ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఫుల్-HD+ డిస్ప్లే మరియు ఆక్టా-కోర్ Unisoc SoC ఫీచర్లతో పాటుగా 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రెండు విభిన్న వేరియంట్‌లలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అదనంగా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,000mAh బ్యాటరీలు కూడా ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో భారతదేశంలో లాంచ్ అయిన రియల్‌మి C25 యొక్క అప్ గ్రేడ్ వెర్షన్ గా Redmi 10 ప్రైమ్, మోటో E40 మరియు Samsung Galaxy M12 లకు పోటీగా లాంచ్ అయిన ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ ఇండియా ధరలు

రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ ఇండియా ధరలు

భారతదేశంలో రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.11,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర రూ.12,999. ఇది గ్లోయింగ్ బ్లాక్ మరియు గ్లోయింగ్ గ్రీన్ కలర్ లలో వస్తుంది. అలాగే ఇది మార్చి 12 మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart, Realme.com మరియు దేశంలోని రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా మొదటిసారి కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. గత సంవత్సరం రియల్‌మి C25 ను భారతదేశంలో 4GB + 64GB మోడల్ ను రూ.9,999 మరియు 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌లో రూ.10,999 ధర వద్ద లాంచ్ చేసింది.

రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C35 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11లో రియల్‌మి UI R ఎడిషన్‌తో రన్ అవుతుంది. అలాగే ఇది 90.7 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద ఫోన్ స్టాండర్డ్‌గా 4GB LPDDR4X RAMతో పాటు octa-core Unisoc T616 SoCని కలిగి ఉంది.

ఫోటోగ్రఫీ

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే రియల్‌మి C35 వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ F/1.8 లెన్స్‌తో పాటు Realme GT 2లో లభించే అదే 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు f/2.8 లెన్స్‌తో మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.0 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ Sony IMX355 సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 128GB వరకు ఆన్‌బోర్డ్ UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరణకు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C35 Smartphone Launched in India With Octa-Core Unisoc T616 SoC: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X