Realme కొత్త ఫోన్ వివరాలు లీక్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్ విడుదల కానుంది. రియల్‌మీ ఫోన్లకు భారత్ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. రియల్‌మీ C51 ఫోన్ త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. అయితే ఆ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.
టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ Realme C51 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లను లీక్ చేశాడు. ఈ ఫోన్ 6.7 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. డిస్‌ప్లే 720*1600 పిక్సల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆపిల్ డైనమిక్ ఐలాండ్ తరహా మినీ క్యాప్సూల్ ఫీచర్‌ను కలిగి ఉంది. మరియు వెనుకవైపు ఎల్‌డీఈ ప్లాష్‌ను గమనించవచ్చు.

రియల్‌మీ C51 Unisock T612 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు 4GB ర్యామ్, 64GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. అదనంగా 4GB వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు అంతర్గత స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలో రియల్‌మీ C51 స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందని సమాచారం. 50MP ప్రధాన కెమెరా, 8MP సెన్సార్, 5MP సెన్సార్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.

రియల్‌మీ C51 స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుందని సమాచారం. USB టైప్-సీ పోర్ట్, బ్లూటూత్, వైఫై సహా ఇతర ఫీచర్లతో రానుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్‌తో వస్తుంది. మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది.
అయితే రియల్‌మీ C51 స్మార్ట్‌ఫోన్ ధర, ఎన్ని వేరియంట్లలో అందుబాటులోకి వస్తుందో సమాచారం లేదు. దాంతోపాటు భారత మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ కానుందనే అంశంపై స్పష్టత లేదు. భారత్‌కు చెందిన BIS సహా వివిధ దేశాల వెబ్‌సైట్‌లలో మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ కనిపించింది.
* ఇటీవలే రియల్‌మీ c53 ఫోన్ విడుదల అయింది. రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 4GB ర్యామ్, 128 GB అంతర్గత స్టోరేజీ బేస్ మోడల్ ధర రూ.9,999 మరియు 6GB ర్యామ్, 64GB అంతర్గత స్టోరేజీ ధర రూ.10,999గా ఉంది.
జులై 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్‌మీ వైబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. 6GB ర్యామ్, 64 GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను ICICI, HDFC, SBI కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందుతారు.
ఈ ఫోన్‌లో కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. B&W లెన్స్‌తోపాటు 108MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ UI T ఎడిషన్‌పై పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








