Home
News

Realme నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. డిజైన్‌, స్పెసిఫికేషన్లు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ తన సీ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను విస్తరించనుంది. ఇందులో భాగంగా Realme C51 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ మేరకు X (ట్విట్టర్‌)లో సంస్థ పోస్టు చేసింది.

భారత్‌లో ఈ C- సిరీస్‌లో ఇప్పటికే C55, C53 స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. రియల్‌మీ C51 స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ గత నెలలోనే తైవాన్‌లో విడుదల చేసింది. ఇదే వేరియంట్‌ను భారత్‌లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై ఎటువంటి ప్రకటన రాలేదు.

realme c51 smartphone to launch in india

రియల్‌మీ C51 స్పెసిఫికేషన్లు : రియల్‌మీ C51 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 720*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుంది. మరియు 560 nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్‌ UniSoc T612 చిప్‌సెట్‌తో రానుంది.

రియల్‌మీ C51 స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌, 64GB అంతర్గత స్టోరేజీతో రానుంది. మైక్రో SD కార్డు సాయంతో స్టోరేజీని పెంచుకొనే సదుపాయం ఉంది. ఈ ఫోన్‌ డ్యూయల్‌ సిమ్ కార్డు సపోర్టుతో రానుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ UI T ఎడిషన్‌పై పనిచేస్తుంది.

రియల్‌మీ C51 ఫోన్‌ వెనుకవైపు f/1.8 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరా, మరో డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. 1080p 30fps పుల్‌ హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ చేసుకోవచ్చు. ముందువైపు f/2.0 అపేచర్‌తో 5MP కెమెరాను కలిగి ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ రియల్‌మీ ఫోన్‌ బడ్జెట్ రేంజ్‌లో రానున్నట్లు తెలుస్తోంది. మరియు సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో రానుంది. వాటర్‌ డ్రాప్‌ నాచ్ డిస్‌ప్లే్తో రానుందని తెలుస్తోంది. 4G VoLTE, బ్లూటూత్ v5.0, వైఫై, USB-C v2.0 పోర్టును కలిగి ఉంటుంది.

అయితే ఈ ఫోన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అనే దానిపై సంస్థ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కేవలం త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఈ ఫోన్‌ రియల్‌మీ వెబ్‌సైట్‌, ప్రముఖ ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ నలుపు, గ్రీన్‌ రంగుల్లో కనిపించింది.

*రియల్‌మీ సంస్థ ఇటీవల భారత్‌లో రూ.20,000 లోపు ధర కలిగిన 5G స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. రియల్‌మీ 11 5G, 11X 5G స్మార్ట్‌ఫోన్లు ఇవాళ్టి నుంచి ఫ్లిప్‌కార్టు ద్వారా అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. భారత్‌లో రియల్‌మీ 11X 5G ఫోన్‌.. 6GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ రూ.14,999గా ఉంది. అదే 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ రూ.15,999కు లభిస్తుంది.

ఈ ఫోన్‌ మీడియా టెక్‌ డైమెన్సిటీ 6100+ SoC ద్వారా మాలి G57 MC2 GPUతో జతచేయబడింది. ఈ ఫోన్‌ గరిష్ఠంగా 8GB LPDDR4X ర్యామ్‌, 128GB UFS 2.2 స్టోరేజీతో వస్తుంది. రియల్‌మీ 11X 5G ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ UI 4.0పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ మిడ్‌నైట్‌ బ్లాక్‌, పర్పుల్‌ డాన్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
realme c51 smartphone to launch in india soon teaser video out
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X