Home
News

Reamle C53 స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం.. 108MP కెమెరా, ధర రూ.9,999..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ గత వారం కొత్త ఫోన్‌ C53ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్‌మీ స్టో్ర్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర రిటైల్‌ దుకాణాల్లో లభించనుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ఛాంపియన్‌ గోల్డ్‌, ఛాంపియన్ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

Realme C53 స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ రూ.9,999కు అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా 6GB ర్యామ్‌ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌పై 1000 రూపాయల తగ్గింపును పొందవచ్చు. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.9,999కు సొంతం చేసుకోవచ్చు. ICICI, HDFC, SBI బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ఈఎంఐలో కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

realme C53 smartphone

రియల్‌మీ C53 స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 720*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ మిని క్యా్ప్సుల్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్‌ తొలిసారిగా రియల్‌మీ c55 స్మార్ట్‌ఫోన్‌లో పరిచయం చేయబడింది. ఈ ఫీచర్‌ డిస్‌ప్లేను అడ్జస్ట్‌ చేస్తుంది. ఈ ఫీచర్‌ ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ మోడల్‌లోని డైనమిక్‌ ఐలాండ్‌ తరహాలో ఉంటుంది.

రియల్‌మీ C53 స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ Unisoc T612 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. రెండు ర్యామ్‌, స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా ఫోన్‌ స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌ డ్యూయల్‌ సిమ్‌ కార్డును సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ UI ఎడిషన్‌పై పనిచేయనుంది.

realme C53 smartphone

రియల్‌మీ C53 స్మార్ట్‌ఫోన్‌ 108MP కెమెరాను కలిగి ఉంటుంది. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు ఈ ధరలో 108MP కెమెరాను కలిగి ఉండడం తొలిసారని సంస్థ తెలిపింది. ఈ కెమెరా 3x సెన్సార్‌లను కలిగి ఉంది. మరియు అనేక రకాల కెమెరా మాడ్యూల్‌లను కలిగి ఉంటుంది.

108MP మోడ్‌, వీడియో, నైట్‌ మోడ్‌, పనోరమిక్‌ వ్యూ, ఎక్స్‌పర్ట్‌, టైమ్‌ల్యాప్స్‌, పొర్ట్రెయిట్‌ మోడ్‌, హెచ్‌డీఆర్‌, AI టెక్నాలజీ, ఫిల్టర్‌, స్లో మోషన్‌ మోడ్‌లను కలిగి ఉంటుంది. ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 18W SuperVooc ఛార్జింగ్‌ సపోర్టుతో రానుంది.

* త్వరలో రియ‌ల్‌మీ C51 విడుదల కానుంది. ఆ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు లీక్‌ అయ్యాయి. టిప్‌స్టర్‌ పరాస్‌ గుగ్లానీ Realme C51 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లను లీక్‌ చేశాడు. ఈ ఫోన్‌ 6.7 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

డిస్‌ప్లే 720*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. వాటర్‌డ్రాప్‌ స్టైల్‌ నాచ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఆపిల్‌ డైనమిక్‌ ఐలాండ్‌ తరహా మినీ క్యాప్సూల్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. మరియు వెనుకవైపు ఎల్‌డీఈ ప్లాష్‌ను గమనించవచ్చు.

రియల్‌మీ C51 Unisock T612 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు 4GB ర్యామ్‌, 64GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. అదనంగా 4GB వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు అంతర్గత స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలో రియల్‌మీ C51 స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందని సమాచారం. 50MP ప్రధాన కెమెరా, 8MP సెన్సార్‌, 5MP సెన్సార్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.

More from GizBot

Best Mobiles in India

English summary
realme C53 smartphone sale is live on flipkart with rs9999 starting price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X