108MP కెమెరా, 5000mAh బ్యాటరీతో Realme కొత్త స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ నుంచి కొత్త ఫోన్ Realme C53 విడుదల కానుంది. రియల్‌మీ C53 స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం మే నెలలో మలేషియాలో లాంచ్ చేసింది. భారత్‌లోనూ ఇదే మోడల్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే ఫ్లిప్‌కార్టులో లిస్టింగ్ అయింది.
అందులోని వివరాలు ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డ్ కలర్ వేరియంట్‌ను కలిగి ఉంది. షైనీ గోల్డ్ కలర్ ఫినిష్‌తో వస్తుంది. మరియు 7.9mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ఇందులో ప్రధానంగా 108MP కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంది. అయితే కెమెరా మిగిలిన స్పెసిఫికేషన్ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

రియల్‌మీ C53 స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 18W ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. 50 శాతం ఛార్జింగ్‌ను 52 నిమిషాల్లో పూర్తవుతుందని సంస్థ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కింది భాగంలో USB పోర్టు, స్పీకర్లు, హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంటాయి. మరియు ఈ ఫోన్ కుడివైపున వాల్యూమ్ బటన్‌పైన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.
రియల్‌మీ C53 స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు రీఫ్రెష్ రేట్ 90Hz, బ్రైట్‌నెస్ 560 nitsగా ఉంది. ఈ ఫోన్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ UI T ఎడిషన్ ఆధారంగా పనిచేస్తుంది.

రియల్‌మీ C53 స్మార్ట్‌ఫోన్ ముందువైపు U ఆకారంలో నాచ్ డిజైన్‌తో వస్తుంది. మరియు WiFi, బ్లూటూత్ 5.0తోపాటు ట్రిపుల్ కార్డు స్లాట్‌ను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ గోల్డ్, బ్లాక్ రెండు రంగులు లభించనుంది. అయితే ఈ ఫోన్‌లో 5G సదుపాయం లేనట్లు తెలుస్తోంది. ఫోన్ విడుదల సమయంలో స్పష్టత వస్తుంది.
రియల్‌మీ C53 స్మార్ట్ ఫోన్ ధర రూ.10,000 నుంచి 13,000 రూపాయల మధ్య భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ జులై 19 తేది, మధ్యాహ్నం 12 PM గంటలకు లాంచ్ కానుంది. విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక స్టోర్లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధానంగా 108MP కెమెరా ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. నోకియా, మోటోరొలా, ఇన్ఫినిక్స్, శాంసంగ్ ఫోన్లకు ఈ కొత్తఫోన్ పోటీనిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా స్మార్ట్‌ఫోన్ సంస్థలు కెమెరా విభాగంపై దృష్టి పెడుతున్నాయి. ఇటీవల కాలంలో 108MP కెమెరా స్పెసిఫికేషన్లు కలిగిన ఫోన్లు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








