100MP కెమెరా Realme స్మార్ట్‌ఫోన్‌పై బెస్ట్ డిస్కౌంట్.. ఆఫర్ ఎప్పటి వరకు ఉందంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తన నార్జో 60 సిరీస్ (Realme Narzo 60) హ్యాండ్‌సెట్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల చేసింది. ప్రస్తుతం రియల్‌మి నార్జో 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్, 1TB స్టోరేజీ వేరియంట్‌పైన ఎక్స్చేంజీ సహా డిస్కౌంట్‌ను ప్రకటించింది.
రియల్‌మి క్రిస్మస్ సేల్ ( Realme Christmas sale 2023 ) మరియు అమెజాన్ Xmas ( Amazon Xmas 2023 ) లో భాగంగా ఈ ఆఫర్‌ను ప్రకటన చేసింది. ఈ ప్రత్యేక సేల్ డిసెంబర్ 26 వరకు అందుబాటులో ఉంటుందని రియల్‌మి సంస్థ తెలిపింది.

రియల్‌మీ నార్జో 60 ప్రో 5G ధర : రియల్‌మి నార్జో 60 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB మోడల్‌పై రూ.3000 కూపన్ డిస్కౌంట్ తర్వాత రూ.20,999గా ఉంది. అదే 12GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ మోడల్‌ను రూ.3000 డిస్కౌంట్ తర్వాత రూ.23,999గా ఉంది.
అదే రియల్‌మీ నార్జో 60 ప్రో స్మార్ట్ ఫోన్ టాప్ ఎండ్ మోడల్ 12GB ర్యామ్, 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.2000 డిస్కౌంట్ తర్వాత రూ.27999గా ఉంది. ఈ ఫోన్ మార్స్ ఆరెంజ్, కాస్మిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
రియల్‌మి ఇండియా ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా మొబిక్విక్ ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ ( రూ.1000 ) పొందవచ్చు. రియల్‌మి కేర్+ ప్రయోజనాలను పొందవచ్చు. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్ల ద్వారా అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. 1TB స్టోరేజీ టాప్ ఎండ్ వేరియంట్‌పై ఎక్స్చేంజీ ద్వారా రూ.28,450 పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను పొందవచ్చు.
రియల్‌మీ నార్జో 60 ప్రో స్పెసిఫికేషన్లు : నార్జో 60 ప్రో 5G హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల FHD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6nm డైమెన్సిటి 7050 CPUతో Mail G68 GPU పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మి UI 4.0 పైన పనిచేస్తుంది. దీంతోపాటు 67W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.
రియల్‌మీ నార్జో 60 ప్రో స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 100MP OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌తో కూడిన ప్రధాన కెమెరా, 2MP పోట్రాయిట్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్ 5.2, USB-C పోర్టు, మరియు ఈ ఫోన్ డ్యూయల్ స్పీకర్లును కలిగి ఉంటుంది. ఆరెంజ్ వేరియంట్‌లో వేగాన్ లెథర్‌తో వస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








