Realme 12 Pro 5G సిరీస్ కోసం ఆస్కార్ విజేతతో రియల్‌మి భాగస్వామ్యం.. ఎందుకంటే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి కీలక విషయాన్ని వెల్లడించింది. రియల్‌మి 12 ప్రో 5G సిరీస్ (Realme 12 Pro 5G Series) సినిమాటిక్ పోర్ట్రెయిట్‌లను రూపొందించేందుకు ఆస్కార్ సాధించిన సినిమాటోగ్రాఫర్ క్లాడియో మిరాండాతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం భారత వినియోగదారులకు మంచి పోర్ట్రెయిట్ అనుభవాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది.
ప్రముఖ సినిమా 'లైఫ్ ఆఫ్ పై'.. క్లాడియో మిరాండాకు (Cinematographer Claudia Miranda) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టింది. 'ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్' సినిమాలో డేవిడ్ ఫెంచర్‌తో భాగస్వామ్యం కుదిరింది. ఈ చిత్రం తొలిసారిగా పూర్తిగా డిజిటల్‌గా తెరకెక్కింది. ఇది ఉత్తమ సినిమాటోగ్రఫీ అకాడమీకి నామినేట్ చేయబడింది. అనంతరం సినిమాటోగ్రఫీ విభాగంలో క్లాడియో మిరాండాకు ప్రత్యేక స్థానాన్ని పటిష్ఠం చేసింది.

రియల్‌మి 12 ప్రో సిరిస్ 5G కోసం రూపొందించిన పిల్టర్‌లను పరిచయం చేయడం రియల్‌మి, క్లాడియో మిరాండా మధ్య భాగస్వామ్యానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. క్లాడియో మిరాండ్ నుంచి ప్రేరణతో వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇవి మరింత సినిమాటిక్ అనుభూతితో రెట్రో స్టైల్‌ను ప్రేరేపిస్తాయని తెలుస్తోంది. క్లాడియో సినిమాలను తలపించేలా ఉంటాయని సంస్థ చెబుతోంది.
ఈ రియల్‌మి 12 ప్రో సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్ 2.39:1 రేషియోతో క్యాప్చర్ చేస్తాయి. ఈ ప్రత్యేక ఫీచర్ ఫోటోగ్రఫీ ప్రియులకు క్లాసిక్ మూవీ ఫార్మాట్‌ను క్యాప్చర్ చేసేందుకు అనుమతి ఇస్తుంది. సినిమాటిక్ టచ్‌తో ఆకట్టుకొనే పోర్ట్రెయిట్‌లను క్యాప్చర్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.

ఈ ఫోన్ సినిమాటిక్ బోకె అల్గారిథమ్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ఫోటోగ్రఫీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇది సహజమైన, మెరుగైన లైటింగ్‌తోపాటు అద్భుతమైన పోర్ట్రెయిట్ షాట్‌లను అందిస్తుంది. బ్లర్ ఎఫెక్ట్, హెయిర్‌లైన్ లెవల్, కీయింగ్ ఎఫెక్ట్ వంటిని ప్రభావవంతంగా ఉండేలా చూస్తాయి.
రియల్‌మి 12 ప్రో 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్లు పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటాయి. ఈ లెన్స్ 120X వరకు అద్భుతమైన జూమ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. మరియు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సామర్థ్యంతో ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ ఫోన్‌గా అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అధికారిక ఫోటోలు ఆధారంగా రియల్‌మి 12 ప్రో ప్లస్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలతో కూడిన వృత్తాకార మాడ్యూల్‌ను కలిగి ఉంది. 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, 120X జూమ్ సామర్థ్యాలు కలిగిన 64MP పెరిస్కోప్ లెన్స్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. 8MP అల్ట్రా వైడ్ లెన్స్ మూడో కెమెరాగా ఉండే అవకాశం ఉంది. కెమెరా మాడ్యుల్ గోల్డెన్ మెటాలిక్ డయల్‌ను పొందుతుంది.
ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ : ఇప్పటికే వచ్చిన కొన్ని లీక్‌ల ఆధారంగా రియల్‌మి 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల కర్వడ్ అమోలెడ్ పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీంతోపాటు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుందని తెలుస్తోంది.
రియల్‌మి 12 ప్రో ప్లస్ అండర్ ది హుడ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిప్ 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీతో జతచేయబడినట్లు సమాచారం. ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5 పైన పనిచేస్తుందని భావిస్తున్నారు.
రియల్‌మి 12 ప్రో మోడల్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ నావిగేటర్ బీజ్ మరియు సబ్‌మెరైన్ బ్లూ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. ఈ సిరీస్ జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications








