6 నెలల్లోనే, ఐఫోన్ 14 ప్రో యొక్క టాప్ ఫీచర్ ను కాపీ కొట్టేసిన రియల్ మీ!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన రియల్‌మీ తమ కొత్త సి-సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్ మీ C55 గా పిలువబడే ఈ స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో అధికారికంగా లాంచ్ చేయబడింది. ఫీచర్లలో, ఈ ఫోన్ యొక్క ప్రధాన హైలైట్ ఆపిల్ యొక్క డైనమిక్ ఐలాండ్ లాంటి మినీ క్యాప్సూల్ డిస్‌ప్లే ఫీచర్ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఈ ఫీచర్ ద్వారా డిస్ప్లే యొక్క మధ్యలో సాంప్రదాయ పంచ్ హోల్ కెమెరా కటౌట్ ఉంది. ఫోన్ యొక్క ఛార్జింగ్, డేటా వినియోగం, తక్కువ బ్యాటరీ మరియు ఇతర సమాచారం వంటి నోటిఫికేషన్‌లను చూపడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పైన చెప్పినట్లుగా, ఈ స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ చేయబడింది. కానీ ఇది భారతదేశంతో సహా ఇతర దేశాలలో త్వరలో లాంచ్ కావొచ్చని అంచనాలున్నాయి.

రియల్ మీ C55 ధర వివరాలు
రియల్ మీ C55 రెండు RAM మోడల్‌లలో లాంచ్ చేయబడింది. వీటిలో 6GB మరియు 8GB RAM , 128GB మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్ల యొక్క ధరలు Rp 2,499,000 (సుమారు ₹13,300), తరువాతి మోడల్ ధర Rp 2,999,000 (సుమారు ₹16,000) గా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రంగుల ఆప్షన్లలో వస్తుంది. రైనీ నైట్ మరియు సన్ షవర్ రంగులలో వచ్చే ఈ ఫోన్ అమ్మకాలు, ఇండోనేషియాలో మార్చి 8 నుంచి మొదలయ్యాయి.
రియల్ మీ C55 స్పెసిఫికేషన్ల వివరాలు
రియల్ మీ C55 స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల FHD + IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. మాలి G52 2EEMC2 GPU తో మీడియా టెక్ హీలియో G88 ప్రాసెసర్ చిప్ సెట్ ఈ ఫోన్ ను మరింత శక్తివంతం చేస్తుంది.
ఈ ఫోన్ 8GB LPDDR4x RAM వరకు మరియు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది స్టోరేజీ విస్తరించడానికి మైక్రో SD కార్డ్‌తో కూడా వస్తుంది. రియల్ మీ C55 ఫోన్ ఆండ్రాయిడ్13 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆధారంగా రియల్ మీ UI కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది.
ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే, ఇది 33 వాట్ల సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్ యొక్క కెమెరా ఫీచర్లను గమనిస్తే, రియల్ మీ C55 ముందు వైపు సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 8MP సెన్సార్‌ను కలిగి ఉంది.
ఇంకా, వెనుకవైపు 64MP ప్రైమరీ కెమెరా 2MP సెకండరీ సెన్సార్ మరియు LED ఫ్లాష్‌తో జత చేయబడి ఉంటుంది. 4G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, GPS మరియు USB టైప్-C పోర్ట్ లు రియల్ మీ C55 ఫోన్లో అందుబాటులో ఉన్న కనెక్టివిటీ ఆప్షన్లు అని చెప్పవచ్చు. ఇక భద్రతా ఫీచర్ల వివరాలు గమనిస్తే, ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అమర్చబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








