Realme Days అమ్మకంలో ఈ ఫోన్‌లపై ఊహించని తగ్గింపు ఆఫర్స్...

|

రియల్‌మి సంస్థ ఇండియాలో తన యొక్క గుర్తింపును మరింత పెంచుకోవడం కోసం ఇప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నది. ఈ ఉత్పత్తులను వినియోగదారులకు అందివ్వడం కోసం ఈ-కామర్స్ సంస్థలతో పాటుగా సంస్థ యొక్క సొంత వెబ్‌సైట్‌లో రకరకాల అమ్మకాలను ప్రారంభిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు రియల్‌మి డేస్ అమ్మకం ఫ్లిప్ కార్ట్ మరియు వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది.

రియల్‌మి డేస్ సేల్ 2021

రియల్‌మి డేస్ సేల్ 2021

వినియోగదారులు రియల్‌మి యొక్క స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు మరియు ఉపకరణాలను ఈ అమ్మకంలో డిస్కౌంట్‌ ధరల వద్ద పొందవచ్చు. ఈ అమ్మకం ఏప్రిల్ 21 న ప్రారంభమయి ఏప్రిల్ 24 వరకు అందుబాటులో ఉంటుంది. రియల్‌మి వెబ్‌సైట్‌లో నాలుగు రోజులపాటు హోస్ట్ చేయబడుతున్న అమ్మకంలో రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు మరియు వివిధ ఉత్పత్తులను తగ్గింపు దరల వద్ద పొందడంతో పాటుగా ఫ్రీచార్జ్‌ ద్వారా కొనుగోలు చేసిన వారికి 75 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను మరియు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను రూ.200 వరకు అందిస్తోంది.

రియల్‌మి డేస్ డిస్కౌంట్ ఆఫర్లు

రియల్‌మి డేస్ డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్ కార్ట్ మరియు రియల్‌మి వెబ్‌సైట్‌లో నాలుగు రోజులపాటు నిర్వహించే 'రియల్‌మి డేస్' అమ్మకంలో రియల్‌మి స్మార్ట్ టీవీ SLED 4K, రియల్‌మి C15 క్వాల్కమ్ ఎడిషన్, రియల్‌మి 7, రియల్‌మి 7 ప్రో, రియల్‌మి నార్జో 20 ప్రో, రియల్‌మి 6 ప్రో, రియల్‌మి X3, రియల్‌మి X3 సూపర్‌జూమ్‌లను డిస్కౌంట్ ఆఫర్లలో పొందవచ్చు. అలాగే రియల్‌మి X7 మరియు రియల్‌మి X7 ప్రో స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు మీద అదనంగా ప్రీపెయిడ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

రియల్‌మి C15

రియల్‌మి స్మార్ట్ టీవీ SLED 4K: ఈ 55 అంగుళాల స్మార్ట్ టీవీ యొక్క రూ.43,999 సాధారణ ధరకు బదులుగా దీనిని ప్రస్తుత అమ్మకంలో రూ.40,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. డాల్బీ ఆడియో సౌండ్‌తో కూడిన 4K టీవీ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌తో రన్ అవుతుంది.


రియల్‌మి C15 క్వాల్‌కామ్ ఎడిషన్: రియల్‌మి డేస్ ఆఫర్లలో భాగంగా రియల్‌మి C15 క్వాల్కమ్ ఎడిషన్ మీద రూ.1,000 క్యాష్‌బ్యాక్ డిస్కౌంట్ లభించిన తర్వాత ఇప్పుడు రూ.8,999 ధర వద్ద లభిస్తుంది.

 

రియల్‌మి 7

రియల్‌మి 7: రియల్‌మి 7 స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుత అమ్మకంలో డిస్కౌంట్ లభించిన తరువాత రూ.13,499 ధరను కలిగి ఉంది. ఇది ఇప్పటికీ కఠినమైన గేమ్‌లను నిరంతరం ఆడే మొబైల్ గేమర్‌లకు మంచి ఒప్పందంగా ఉంది. హెలియో G95 చిప్ మరియు 90HZ LCD డిస్‌ప్లే వంటివి ఈ ఫోన్‌లో గుర్తించదగిన ముఖ్యమైన ఫీచర్లు .

రియల్‌మి 7 ప్రో: రియల్‌మి 7 ప్రో ప్రస్తుత అమ్మకంలో రూ.17,999 ధర వద్ద లభిస్తుంది. మొబైల్ ఫోటోగ్రాఫర్‌లకు ఇది మంచి ఎంపిక. ఇది 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 65W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు అమోలెడ్ డిస్‌ప్లేను వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

 

రియల్‌మి నార్జో 20 ప్రో

రియల్‌మి నార్జో 20 ప్రో ప్రస్తుత ఆఫర్లలో రూ.12,999 ధర వద్ద లభిస్తుంది. నార్జో 20 ప్రో 65W ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్ మరియు 48 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరాలతో వస్తుంది.

రియల్‌మి 6 ప్రో ప్రస్తుతం రూ.17,999 ధర వద్ద లభిస్తూ ఇప్పటికీ రూ.20,000 ధర లోపు కేటగిరీలో మంచి ఎంపికగా ఉంది. అయితే మీరు డిజైన్‌ను ఇష్టపడితేనే కొనండి. రియల్‌మి 7 ప్రో మరియు రియల్‌మి 8 ప్రో దీనికి మంచి ప్రత్యామ్నాయాలుగా కూడా ఉన్నాయి.

 

ప్రీపెయిడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు

ప్రీపెయిడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు

రియల్‌మి X7 కొనుగోలు మీద లభించే ప్రీపెయిడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లలో భాగంగా రూ.1,000 వరకు పొందవచ్చు. తద్వారా దీని యొక్క ధరను రూ.18,999 కి తగ్గించవచ్చు. ప్రీపెయిడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లలో భాగంగా రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. రియల్‌మి నార్జో 30 ప్రోకు ప్రీపెయిడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా రూ.1000 లభిస్తుంది, తద్వారా ధర 15,999 రూపాయలకు తగ్గుతుంది.

Best Mobiles in India

English summary
Realme Days Sale Starts on Flipkart and Realme.com: Discount Offers On Realme 7, Realme Narzo 30A, Realme X7, And More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X