Realme Festive Days 2020 Sale: Realme స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలను డిస్కౌంట్ ఆఫర్లతో కొనుగోలు చేయడానికి
చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి తన యొక్క వార్షిక సేల్ ఇండియాలో మొదలుపెట్టనున్నది. "రియల్‌మి ఫెస్టివల్ డేస్ సేల్" పేరుతో సంస్థ ప్రకటించబడింది. ఈ సేల్ అక్టోబర్ 16 న ప్రారంభమై అక్టోబర్ 21 వరకు కొనసాగుతుంది. ఈ అమ్మకం సమయంలో రియల్‌మి సంస్థ ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ పద్దతిలో కొన్ని అద్భుతమైన ఒప్పందాలను కూడా ప్రవేశపెడుతుంది. దీనితో పాటుగా ఉచిత షిప్పింగ్ తో పాటు సంస్థ కొన్ని బ్యాంకులతో కుదుర్చుకున్న ఒప్పందాలతో తమ లావాదేవీలపై కూపన్లు మరియు డిస్కౌంట్లను కూడా ఇవ్వనుంది.

రియల్‌మి ఫెస్టివల్ డేస్ సేల్ లో ధర తగ్గింపు ఫోన్‌లు
రియల్‌మి ఫెస్టివల్ డేస్ అమ్మకం తేదీలు మరియు వివరాలను కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. ఈ అమ్మకం సమయంలో రియల్‌మి 7i, రియల్‌మి7 ప్రో సన్ కిస్స్‌డ్ ఎడిషన్‌ను ఈ అమ్మకం సమయంలో మొదటిసారి అమ్మకానికి అందుబాటులోకి తీసుకువస్తున్నది. అలాగే రియల్‌మి C11, రియల్‌మి C15, రియల్‌మి X3 వంటి సహా రియల్‌మి ఫోన్‌లను తగ్గింపు ధరలతో అందివ్వనుంది. ఈ అమ్మకంలో భాగంగా రియల్‌మి C11 యొక్క ధర మీద రూ.500 తగ్గింపుతో దీనిని రూ.6,999 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ యొక్క ధర రూ.7,499.

రియల్‌మి C15 ఫోన్ మీద ధర తగ్గింపు
రియల్‌మి ఫెస్టివల్ డేస్ అమ్మకం సమయంలో తగ్గింపు ధరలను అందుకుంటున్న మరొక ఫోన్ రియల్‌మి C15. ఈ ఫోన్ మీద రూ.1,000 ధర తగ్గింపుతో రూ.8,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే వాస్తవానికి ఈ ఫోన్ యొక్క ప్రస్తుత ధర రూ.9,999.

రియల్‌మి X3 మీద రూ.3,000 భారీ డిస్కౌంట్
రియల్‌మి X3 స్మార్ట్‌ఫోన్ మీద కూడా రియల్‌మి ఫెస్టివల్ డేస్ అమ్మకంలో రూ.3,000 వరకు భారీ ధర తగ్గింపును అందుకుంటున్నది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క సాధారణ ధర రూ.24,999. కానీ పండుగ కాలంలో దీనిని రూ.21,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇవి కాకుండా రియల్‌మి బడ్స్ క్లాసిక్, రియల్‌మి బడ్స్ వైర్‌లెస్, రియల్‌మి బడ్స్ క్యూ, రియల్‌మి బడ్స్ ఎయిర్ నియో మరియు రియల్‌మి వాచ్ వంటి వాటి మీద కూడా అద్భుతమైన డిస్కౌంట్‌లను ఇవ్వనున్నది.

రియల్‌మి ప్రొడెక్టుల మీద ధర తగ్గింపులు
రియల్‌మి ఫెస్టివల్ డేస్ అమ్మకం సమయంలో స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రొడెక్టులు రియల్‌మి బడ్స్ ఎయిర్ నియో, రియల్‌మి వాచ్‌లను రూ.1,000 మరియు రూ.1,999, రూ. 2,999 ధరల వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే రియల్‌మి బడ్స్ క్లాసిక్ ను రూ.20 ధర తగ్గింపుతో రూ.379 ధర వద్ద, రియల్‌మి బడ్స్ వైర్‌లెస్‌ను రూ.300 ధర తగ్గింపుతో రూ.1,499 ధర వద్ద మరియు రియల్‌మి బడ్స్ క్యూ మీద రూ.500 వరకు ధర తగ్గింపుతో రూ.1,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి స్మార్ట్‌టీవీల మీద డిస్కౌంట్ ఆఫర్లు
రియల్‌మి సంస్థ కొత్తగా ప్రారంభించిన రియల్‌మి 7i మరియు రియల్‌మి 7 ప్రో సన్ కిస్డ్ లెదర్ ఎడిషన్ ను అక్టోబర్ 16 న ఉదయం 12 గంటల (అర్ధరాత్రి) నుంచి అమ్మకానికి రానున్నది. అలాగే వీటితో పాటుగా సంస్థ ఇటీవల విడుదల చేసిన రియల్‌మి స్మార్ట్ ఎస్‌ఎల్‌ఇడి టివి 55-ఇంచ్ టీవీ కొనుగోలు మీద కూడా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందివ్వనున్నది. ఈ అమ్మకం సమయంలో రియల్‌మి బడ్స్ ఎయిర్ ప్రో, రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ ప్రో, మరియు రియల్‌మి S1 సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వంటి కొనుగోలు మీద కూడా డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








