Home
News

రియల్‌మి GT 2 ప్రో మొదటి సేల్స్ లో రూ.5000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు!! ఛాన్స్ మిస్ చేసుకోకండి..

రియల్‌మి కంపెనీ ఇండియాలో గతవారం రియల్‌మి GT 2 ప్రో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ను రియల్‌మి 9 4G మరియు రియల్‌మి బుక్ ప్రైమ్ తో పాటు లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ నేడు ఇండియాలో మొదటిసారి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రారంభమయ్యే అమ్మకాలలో ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC, 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ మరియు 65W సూపర్‌డార్ట్ ఛార్జ్, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి GT 2 ప్రో ధరలు

రియల్‌మి GT 2 ప్రో ధరలు

రియల్‌మి GT 2 ప్రో నేడు రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇందులో 8GB RAM మరియు 128 GB స్టోరేజ్‌ వేరియంట్ యొక్క ధర రూ.44,999 కాగా 12GB RAM + 256 GB స్టోరేజ్ యొక్క వేరియంట్ ధర రూ.57,999. ఇది పేపర్ వైట్, పేపర్ గ్రీన్ మరియు స్టీల్ బ్లాక్ వంటి మూడు కలర్ లలో లభిస్తుంది.దీనిని రియల్‌మి కంపెనీ అధికారిక స్టోర్ మరియు ఫ్లిప్‌కార్ట్ లలో నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలుదారులు ఎంచుకోవచ్చు.

రియల్‌మి GT 2 ప్రో లాంచ్ సేల్స్ ఆఫర్లు

రియల్‌మి GT 2 ప్రో లాంచ్ సేల్స్ ఆఫర్లు

రియల్‌మి GT 2 ప్రో యొక్క మొదటి సేల్స్ యొక్క ఆఫర్‌లలో భాగంగా HDFC బ్యాంక్ కార్డ్‌లు మరియు SBI క్రెడిట్ కార్డ్‌ల ద్వారా హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ.5,000 వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రూ.4,167 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMIలను మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ల కొనుగోళ్లకు 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. రియల్‌మి మరియు ఫ్లిప్‌కార్ట్ కూడా రూ.4,999 విలువైన రియల్‌మి వాచ్ ఎస్‌ను అందిస్తున్నాయి.

రియల్‌మి GT 2 ప్రో స్పెసిఫికేషన్స్

రియల్‌మి GT 2 ప్రో స్పెసిఫికేషన్స్

రియల్‌మి GT 2 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ నానో స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మి యుఐ 3.0పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.7-అంగుళాల 2K (1,440x3,216 పిక్సెల్‌లు) LTPO 2.0 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్ రక్షణతో లభిస్తుంది. అలాగే ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC ద్వారా రన్ అవుతూ గరిష్టంగా 12GB RAMతో జత చేయబడి వస్తుంది.

ఆప్టిక్స్

రియల్‌మి GT 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇది వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS), 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. ఇది 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది. హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G (10-గిగాబిట్), 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడి ఉండడమే కాకుండా 5,000mAh బ్యాటరీని 65W సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Realme GT 2 Pro Smartphone First Sale Starts Today at 12PM via Flipkart and Realme.com: Price, Discount offers and Deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X