Realme GT 2 Pro స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 SoC ఫీచర్లతో లాంచ్ అయింది!! ధరలు ఫీచర్స్ ఇవిగో...

|

రియల్‌మి కంపెనీ ఇండియాలో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గా రియల్‌మి GT 2 ప్రో ని నేడు గ్రాండ్ గా లాంచ్ చేసింది. జనవరి నెలలో ఇదే ఫోన్ ను చైనాలో మరియు ఫిబ్రవరిలో ఐరోపాలో లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 SoC మరియు LTPO 2.0-బ్యాక్డ్ 'సూపర్ రియాలిటీ' డిస్‌ప్లే వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండి రూ.44,999 ప్రారంభ ధర వద్ద లభించే ఈ హ్యాండ్‌సెట్‌ పేపర్ లాంటి ఆకృతితో బయో-బేస్డ్ ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. రియల్‌మి బ్రాండ్ ప్రారంభించిన అత్యంత ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇండియా మార్కెట్ లో iQoo 9 ప్రో, గెలాక్సీ S22 సిరీస్ మరియు తాజా OnePlus 10 ప్రో నుంచి తీవ్ర పోటీని ఎదురుకొంటోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి GT 2 ప్రో ధరలు & సేల్స్ వివరాలు

రియల్‌మి GT 2 ప్రో ధరలు & సేల్స్ వివరాలు

రియల్‌మి GT 2 ప్రో ఇండియాలో రెండు వేరియంట్లలో గ్రాండ్ గా లాంచ్ చేయబడింది. ఇందులో 8GB RAM మరియు 128 GB స్టోరేజ్‌ వేరియంట్ యొక్క ధర రూ.44,999 కాగా 12GB RAM + 256 GB స్టోరేజ్ యొక్క వేరియంట్ ధర రూ.52,999. ఇది పేపర్ వైట్, పేపర్ గ్రీన్ మరియు స్టీల్ బ్లాక్ వంటి మూడు కలర్ లలో లభిస్తుంది. అయితే మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ఇవి కేవలం పరిచయ ధరలు మాత్రమే. 8GB/128GB వేరియంట్ యొక్క అసలు ధర రూ.49,999 కాగా 12GB/256GB వేరియంట్ యొక్క అసలు ధర రూ.57,999. ఇది రియల్‌మి కంపెనీ అధికారిక స్టోర్ మరియు ఫ్లిప్‌కార్ట్ లలో మొదటి సేల్ ఏప్రిల్ 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహించబడుతుంది. కొనుగోలుదారులు ఎంచుకోవడానికి మూడు రంగు ఎంపికలు ఉంటాయి.

రియల్‌మి GT 2 ప్రో స్పెసిఫికేషన్స్
 

రియల్‌మి GT 2 ప్రో స్పెసిఫికేషన్స్

రియల్‌మి GT 2 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ నానో స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మి యుఐ 3.0పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.7-అంగుళాల 2K (1,440x3,216 పిక్సెల్‌లు) LTPO 2.0 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్ రక్షణతో లభిస్తుంది. అలాగే ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC ద్వారా రన్ అవుతూ గరిష్టంగా 12GB RAMతో జత చేయబడి వస్తుంది.

ఆప్టిక్స్

రియల్‌మి GT 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇది వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS), 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. ఇది 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది. హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G (10-గిగాబిట్), 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడి ఉండడమే కాకుండా 5,000mAh బ్యాటరీని 65W సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Realme GT 2 Pro Smartphone Launched in India With Snapdragon 8 Gen 1 Soc and 5000mAh Battery: Price, Specs, Features, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X