Realme GT 2 Pro స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి!! వివరాలు ఇవిగో...

|

ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో తక్కువ కాలంలో గుర్తింపు పొందిన బ్రాండ్ రియల్‌మి నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్ కానున్నట్లు ప్రకటించింది. రియల్‌మి GT 2 ప్రో పేరుతో రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్‌లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ లీక్ ప్రకారం రాబోయే రియల్‌మి స్మార్ట్‌ఫోన్ LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్‌తో జత చేయబడిన Qualcomm Snapdragon 898 SoC ద్వారా రానున్నట్లు సమాచారం. త్వరలో ప్రారంభించబోయే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత రియల్‌మి UI 3.0 ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ని అమలు చేస్తుందని చెప్పబడింది. రియల్‌మి GT 2 ప్రో యొక్క డిస్‌ప్లే, కెమెరా, ఛార్జింగ్ మరియు కనెక్టివిటీ స్పెసిఫికేషన్‌ల గురించి కూడా టిప్‌స్టర్ సూచించింది. ఈ వివరాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి GT 2 ప్రో లీక్ అయిన స్పెసిఫికేషన్‌లు

రియల్‌మి GT 2 ప్రో లీక్ అయిన స్పెసిఫికేషన్‌లు

ప్రముఖ టిప్‌స్టర్ WHYLAB ద్వారా Weiboలో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం రియల్‌మి GT 2 Pro కొత్త ఫోన్ Qualcomm Snapdragon 8 Gen1 (Snapdragon 898) SoC ద్వారా అందించబడుతుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 SoC ద్వారా లోడ్ చేయబడి ఉంటుందని ముందుగా సూచించబడింది. రియల్‌మి స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్ LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్‌కు జత చేయబడుతుందని కొత్త లీక్ పేర్కొంది.

Xiaomi , Redmi నుంచి త్వరలో లాంచ్ కాబోతోన్న కొత్త ఫోన్లు ! వివరాలు చూడండి.Xiaomi , Redmi నుంచి త్వరలో లాంచ్ కాబోతోన్న కొత్త ఫోన్లు ! వివరాలు చూడండి.

రియల్‌మి GT 2 ప్రో
 

రియల్‌మి GT 2 ప్రో - మోడల్ నంబర్ RMX 3301తో 6.51-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేను పొందుతుందని టిప్‌స్టర్ పేర్కొన్నాడు. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 20:9 యాస్పెక్ట్ రేషియో, అధిక రిఫ్రెష్ రేట్ మరియు 404ppi పిక్సెల్ డెన్సిటీని పొందుతుందని ఈ నెల ప్రారంభంలోని నివేదిక పేర్కొంది. అదనంగా రియల్‌మి స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కూడా పొందుతుందని చెప్పబడింది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఇది 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను పొందుతుందని నివేదించబడింది. అలాగే ఇది 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతున్నట్లు లీక్లు తెలిపాయి. అయితే ఫోన్ ఛార్జింగ్ సామర్థ్యం 5,000mAh బ్యాటరీకి 65Wకి పరిమితం చేయబడుతుందని మునుపటి నివేదిక పేర్కొంది. కొత్త లీక్ ప్రకారం కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 6 మరియు బ్లూటూత్ v5.2 ఉండవచ్చు. చెప్పినట్లుగా, ఇది Android 12 ఆధారంగా Realme UI 3.0ని అమలు చేస్తుందని చెప్పబడింది.

BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ల వాలిడిటీలో సరికొత్త సవరణలు...BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ల వాలిడిటీలో సరికొత్త సవరణలు...

 

రియల్‌మి అండర్ డిస్‌ప్లే కెమెరా ఫీచర్ కు సంబందించి ఇటీవల వచ్చిన నివేదికలో పేటెంట్ ఫైలింగ్ నుండి తీసిన కొన్ని వైర్‌ఫ్రేమ్ రేఖాచిత్రాలు ఉన్నాయి. ఈ రేఖాచిత్రాలలో డివైస్ సెల్ఫీ కెమెరాను ఏకీకృతం చేయడానికి ఎటువంటి మచ్చలను కలిగి లేకపోవడం విశేషం. గుర్తుచేసుకుంటే కనుక సెప్టెంబర్‌లో Realme VP Xu Qi Chase నాచ్ లేదా పంచ్ హోల్ లేని స్మార్ట్‌ఫోన్ చిత్రాన్ని Weiboలో పోస్ట్ చేసారు. ఇది పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో తిరిగి వస్తుందనే ఊహాగానాలకు దారితీసింది. అయినప్పటికీ ఆ డివైస్ పాప్-అప్ మెకానిజంతో కూడా రాదని మరియు అండర్ డిస్‌ప్లే కెమెరా టెక్‌ని సూచిస్తూ పోస్ట్ వ్యాఖ్యలలో చేజ్ స్పష్టం చేశారు.

రియల్‌మి GT 2 ప్రో ధరల వివరాలు(ఊహించిన)

రియల్‌మి GT 2 ప్రో ధరల వివరాలు(ఊహించిన)

ఈ నెల ప్రారంభంలో తెలిసిన టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT 2 ప్రోని లాంచ్ చేయగల ధరను సూచించింది. ఫోన్ ధర దాదాపు CNY 4,000 (దాదాపు రూ. 46,500) అయితే ప్రత్యేక ఎడిషన్ CNY 5,000 (దాదాపు రూ. 58,200) ధరను కలిగి ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. అయితే Realme సంస్థ నుండి అధికారిక ధృవీకరణ లేదు కాబట్టి ఈ సమాచారం అంతా సాధారణంగా తీసుకోవాలి.

Best Mobiles in India

English summary
Realme GT 2 Pro Upcoming Smartphone Specifications Leaked: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X