Home
News

Realme GT 5G లాంచ్ నేడే!! లైవ్ స్ట్రీమ్ ఎక్కడ చూడాలో తెలుసా??

రియల్‌మి GT 5G గ్లోబల్ లాంచ్ ఈ రోజు జరుగనున్నది. ఈ ఏడాది మార్చిలో మొదట చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. రియల్‌మి యొక్క ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 888 మొబైల్ ప్లాట్‌ఫామ్‌లో సమకూర్చబడి ఉండడమే కాకుండా 120HZ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఈ లాంచ్ కార్యక్రమంలో రియల్‌మి GT 5Gతో పాటుగా తన మొదటి ల్యాప్‌టాప్ రియల్‌మి బుక్, రియల్‌మి ప్యాడ్ మరియు రియల్‌మి రోబోట్ వాక్యూమ్‌లను కూడా లాంచ్ చేయనున్నట్లు భావిస్తున్నారు.

రియల్‌మి GT 5G గ్లోబల్ లాంచ్ లైవ్ స్ట్రీమ్

రియల్‌మి GT 5G గ్లోబల్ లాంచ్ లైవ్ స్ట్రీమ్

రియల్‌మి GT 5G ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయడం కోసం సిద్ధంగా ఉంది. ఓన్లీ-ఆన్‌లైన్ పద్దతిలో జరిగే ఈవెంట్ రియల్‌మి యొక్క అధికారిక YouTube ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. రియల్‌మి GT 5G గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 5:30 PM IST కి ప్రారంభమవుతుంది.

రియల్‌మి GT 5G ధరల వివరాలు

రియల్‌మి GT 5G ఫోన్ ఒకే ఒక వేరియంట్ లో విడుదల కానున్నది. 12GB ర్యామ్ వద్ద లాంచ్ అయ్యే ఈ మోడల్‌ ధర EUR 549 గా ఉంది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.48,800 గా ఉంది. ఈ ఫోన్‌ను మొదట చైనాలో CNY 2,799 (సుమారు రూ .32,000) వద్ద లాంచ్ చేశారు.

రియల్‌మి GT 5G స్పెసిఫికేషన్స్

రియల్‌మి GT 5G స్పెసిఫికేషన్స్

రియల్‌మి GT 5G యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 6.43-అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 120HZ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మరియు 360HZ టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఉంటుంది. డిస్ప్లే బయోమెట్రిక్స్ యాక్సిస్ కోసం ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ రీడర్‌కు మద్దతును ఇస్తుంది. ఈ ఫోన్‌ శక్తినివ్వడం కోసం స్నాప్‌డ్రాగన్ 888 SoC ను కలిగి ఉంటుంది. ఇది 12GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్ తో జత చేయబడి ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో లభిస్తుంది. ఇది 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో మద్దతు ఇస్తుంది మరియు 65W ఫాస్ట్ ఛార్జ్ పరిష్కారానికి మద్దతు ఇస్తుంది.

 

 

రియల్‌మి బుక్, రియల్‌మి ప్యాడ్ గ్లోబల్ ఈవెంట్‌

రియల్‌మి బుక్, రియల్‌మి ప్యాడ్ గ్లోబల్ ఈవెంట్‌

రియల్‌మి GT 5G ఫోన్‌తో పాటు రియల్‌మి బుక్ అని పిలువబడే మొట్టమొదటి ల్యాప్‌టాప్‌ను కూడా ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు. రియల్‌మి యొక్క ఎగ్జిక్యూటివ్ ఇటీవల కొత్త ల్యాప్‌టాప్ ఎలా ఉంటుందో విషయాన్ని పంచుకున్నారు. రియల్‌మి ఇండియా, యూరప్ సీఈఓ మాధవ్ శేత్ పోస్ట్ చేసిన టీజర్ ప్రకారం కొత్త ల్యాప్‌టాప్‌లో 3: 2 కారక నిష్పత్తిలో అల్యూమినియం బాడీతో ఆపిల్ మాక్‌బుక్ లాంటి డిజైన్ ఉంటుంది.

Best Mobiles in India

English summary
Realme GT 5G Global Launch Event Set Today 5.30PM: Watch Livestream Process, Expected price, and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X