Home
News

ఈ నెల జూన్ 20 న, లాంచ్ కానున్న మరో కొత్త Realme ఫోన్! ధర, స్పెసిఫికేషన్లు

భారతదేశంలో GT 6 లాంచ్ తేదీని రియల్‌మి సంస్థ అధికారికంగా ధృవీకరించింది. ఈ ఫోన్ డిజైన్ మరియు అంచనాల ప్రకారం, ఈ Realme GT 6 ఫోన్ ఏప్రిల్‌లో చైనాలో ఆవిష్కరించబడిన Realme GT నియో 6 యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా ఇండియా మార్కెట్లోకి రాబోతోంది. ఈ విషయం రియల్‌మి వైస్ ప్రెసిడెంట్, Chase Xu రియల్‌టాక్ ఎపిసోడ్ 2 యొక్క టీజర్ వీడియోలో భారతదేశంలో Realme GT 6 అధికారిక లాంచ్ తేదీని కూడా వెల్లడించారు. ఈ వీడియో క్లిప్ సమాచారం ప్రకారం, భారతదేశంలో Realme GT 6 లాంచ్ తేదీ జూన్ 20న జరుగుతుంది.

భారతదేశంలో Realme GT 6 లాంచ్ వివరాలు
రియల్‌మి కంపెనీ ఎగ్జిక్యూటివ్ నిర్వహించిన 'రియల్‌మి టెక్ న్యూస్ ' పేపర్‌లో ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ చూపబడింది. ఇది రియల్‌మి GT 6 యొక్క డిజైన్ రెండర్‌ను కూడా వెల్లడించింది. రియల్‌మి GT 6 అనేక AI ఫీచర్లను కూడా తీసుకువస్తుందని మేము ఇటీవల తెలుసుకున్నాము.

Realme GT 6 India Launch Date Set For June 20

గుర్తుకుచేసుకుంటే, భారతదేశంలో రియల్‌మి GT 6T ఇటీవలే లాంచ్ అయింది దీని ధర రూ. 30,999 నుండి ప్రారంభమవుతుంది. రాబోయే రియల్‌మి GT 6 ఒక మెట్టు పైన ఉంటుంది కాబట్టి, ఇది అధిక ధరను కూడా పొందుతుంది. భారతదేశంలో రియల్‌మి GT 6 ధర రూ. 40,000 నుండి ప్రారంభమవుతుందని అంచానాలున్నాయి.

అయితే, చైనాలో రియల్‌మి GT నియో 6 ధర CNY 2,099 (దాదాపు రూ. 24,750) నుండి ప్రారంభమవుతుంది. రియల్‌మి GT 6 ఫోన్ రియల్‌మి GT నియో 6 కు రీబ్రాండ్ వెర్షన్ అయినందువల్ల అదే రకమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది.

Realme GT నియో 6 స్పెసిఫికేషన్‌లు పరిశీలిద్దాం
రియల్‌మి GT నియో 6 స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 SoC ద్వారా 16GB వరకు LPDDR5X RAM మరియు 512GB వరకు UFS 4.0 స్టోరేజీ తో జత చేయబడుతుంది. ఈ బ్యాటరీ జీవితకాలం పరంగా, ఫోన్ వేగవంతమైన 120W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో గణనీయమైన 5500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

ఈ GT నియో 6 ఫోన్ గణనీయమైన 6.78-అంగుళాల 1.5K 8T LTPO అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో ప్రో-XDR డిస్‌ప్లే టెక్నాలజీ మరియు అనేక రకాల డిస్‌ప్లే మెరుగుదలలు ఉన్నాయి. ఈ ప్యానెల్ 0.5-120Hz మధ్య అనుకూల రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. రియల్ మీ GT నియో 6లోని డిస్ప్లే 6,000 nits యొక్క గరిష్ట ప్రకాశం మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణను కలిగి ఉంది.

రియల్‌మి GT నియో 6 బహుముఖ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, 50MP వెనుక కెమెరా సోనీ IMX882 సెన్సార్ మరియు OIS మద్దతుతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో ఉంటుంది. ముందు భాగంలో, సెల్ఫీలను తీయడానికి 32MP సెల్ఫీ కెమెరా ఉంది. రియల్‌మి GT నియో 6 ఆండ్రాయిడ్ 14-ఆధారిత Realme UI 5.0 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ బాక్స్‌ తో వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT 6 India Launch Date Set For June 20, Official Teaser Announcement Released. Specifications Details Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X