Home
News

Realme నుంచి ఇండియాలో మరో కొత్త ఫోన్! లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు 

Realme GT 6T గత వారం భారతదేశంలో 4nm స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌తో లాంచ్ చేయబడింది.అలాగే,ఈ ఫోన్ ఈ రోజు అమ్మకాలు కూడా మొదలయ్యాయి. ఈ ఫోన్ తర్వాత రియల్‌మి సంస్థ భారత దేశానికీ మరో కొత్త GT సిరీస్ రియల్‌మి ఫోన్ యొక్క లాంచ్ గురించి సూచిస్తుంది. ఇప్పుడు, రియల్‌మి సంస్థ యొక్క వైస్ ప్రెసిడెంట్ చేజ్ జు భారతీయ మార్కెట్ లో Realme GT 7 ప్రో యొక్క లాంచ్ గురించి ధృవీకరించారు. ఇది రియల్‌మి GT 5 ప్రోపై మరిన్ని అప్‌గ్రేడ్‌లతో వస్తుందని భావిస్తున్నారు. ఇక రియల్‌మి GT 5 ప్రో గత ఏడాది చివర్లో చైనాలో ప్రారంభించబడింది. అయితే, ఈ ఫ్లాగ్‌షిప్ పరికరం భారతదేశంలో లాంచ్ చేయలేదు.

రియల్‌మి కంపెనీ భారతదేశంలో రియల్‌మి GT 5 ప్రో ని ఎందుకు లాంచ్ చేయలేదనే వినియోగదారు ప్రశ్నకు సమాధానమిస్తూ, రియల్‌మి ఈ సంవత్సరం భారతదేశంలో రియల్‌మి GT 7 ప్రో ని విడుదల చేయనున్నట్లు చేజ్ జు ధృవీకరించారు. అయితే, అతను ఖచ్చితమైన లాంచ్ టైమ్‌లైన్ లేదా ఏదైనా స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు.

Realme GT 7 Pro India Launch Confirmed

రియల్‌మి GT 5 ప్రో గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్ చేయబడింది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌పై నడుస్తుంది. దీని ఆధారంగా, తదుపరి తరం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 SoCతో ఈ సంవత్సరం చివరి నాటికి రియల్‌మి GT 7 ప్రో అధికారికంగా అందుబాటులోకి వస్తుందని మేము ఊహించవచ్చు. ఈ బ్రాండ్ జూన్‌లో మరో GT-సిరీస్ స్మార్ట్‌ఫోన్ - Realme GT 6 ని లాంచ్ చేస్తుందని కూడా భావిస్తున్నారు.

రియల్‌మి GT 5 ప్రో యొక్క బేస్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం CNY 3,298 (దాదాపు రూ. 40,000) ప్రారంభ ధరను కలిగి ఉంది. ఇది 6.78-అంగుళాల 1.5K (1,264x2,780 పిక్సెల్‌లు) అమోలెడ్ డిస్‌ప్లేను 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో మరియు గరిష్టంగా 4,500 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది.

ఇది 16GB వరకు RAM మరియు 1TB వరకు స్టోరేజీ ప్యాక్ చేస్తుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది, ఇది 50 మెగాపిక్సెల్ సోనీ LYT-808 సెన్సార్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ సోనీ IMX615 కెమెరా ఉంది. ఈ రియల్‌మి GT 5 ప్రో ఫోన్ 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400mAh బ్యాటరీ కి మద్దతునిస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT 7 Pro India Launch Confirmed, Expected Specifications Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X