Home
News

రియల్‌మి GT మొదటి సేల్ ప్రారంభం కానున్నది!! డిస్కౌంట్ ఆఫర్స్ అనేకం

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి ఇండియాలో గత వారంలో రియల్‌మి GT మరియు రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్ వంటి రెండు 5G ఫోన్‌లను విడుదల చేసింది. వీటిలో రియల్‌మి GT స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయడం కోసం మొదటిసారి అందుబాటులోకి రానున్నది. 120Hz సూపర్ AMOLED డిస్‌ప్లేలతో పాటుగా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లను కలిగి ఉండి టాప్-ఆఫ్-లైన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC తో రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి సేల్ లో కొన్ని ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. వీటి గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Realme GT ధరల వివరాలు

Realme GT ధరల వివరాలు

రియల్‌మి GT స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం కొనుగోలు చేయడానికి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ.37,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ రూ.41,999 ధర వద్ద అందుబాటులో ఉంది. ఈ ఫోన్ గ్లాస్ నిర్మాణాన్ని కలిగి ఉండి డాషింగ్ బ్లూ మరియు డాషింగ్ సిల్వర్ షేడ్స్‌లో వస్తుంది. అయితే వేగన్ లెదర్ ఫినిషింగ్‌లో రేసింగ్ ఎల్లో కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంది.

రియల్‌మి GT మొదటి సేల్ డిస్కౌంట్ ఆఫర్స్

రియల్‌మి GT మొదటి సేల్ డిస్కౌంట్ ఆఫర్స్

రియల్‌మి GT స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో నేడు మధ్యాహ్నం 12PM నుంచి మొదటి సారి అమ్మకానికి రానున్నది. అలాగే ఇది Flipkart, Realme.com మరియు ప్రధాన రిటైల్ స్టోర్‌ల ద్వారా కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. Flipkart యొక్క స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ కింద ఈ ఫోన్‌ను అందించడానికి రియల్‌మి సంస్థ Flipkart తో భాగస్వామ్యం కలిగి ఉంది. దీని కారణంగా కస్టమర్‌లు 70 శాతం ధర తగ్గింపుతో రియల్‌మి GTను పొందడానికి అనుమతిస్తుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి రూ.3000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి.

రియల్‌మి GT స్నాప్‌డ్రాగన్ 888 SoC స్పెసిఫికేషన్స్

రియల్‌మి GT స్నాప్‌డ్రాగన్ 888 SoC స్పెసిఫికేషన్స్

రియల్‌మి GT యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై రియల్‌మి యుఐ 2.0 తో రన్ అవుతుంది. ఇది 6.43-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు 120HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 1,000 నిట్స్ గరిష్ట ప్రకాశంను కలిగి ఉంది. ఇది హుడ్ కింద క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC తో శక్తిని పొందుతూ 12GB వరకు LPDDR5 ర్యామ్ తో జతచేయబడి వస్తుంది.

ఆప్టిక్స్

రియల్‌మి GT యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా సెటప్‌లో f/1.8 లెన్స్‌తో 64-మెగాపిక్సెల్ సోనీ IMX682 ప్రైమరీ సెన్సార్‌ను, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌ని మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ని కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కొసం ముందు భాగంలో ఎఫ్/2.5 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది 65W సూపర్‌డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఫోన్ గ్లాస్ ఫినిషింగ్ 158.5x73.3x8.4 మిమీ మరియు 186 గ్రాముల బరువు ఉంటుంది. అయితే, దీని శాకాహారి తోలు వెర్షన్ 8.5 మిమీ మందం మరియు 186.5 గ్రాముల బరువు కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT First Sale Start Today at 12PM Via Flipkart and Realme.com: Price, Specs, Features, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X