రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్ మొదటి సేల్లో అధిక డిస్కౌంట్ ఆఫర్స్!! మిస్ అవ్వకండి
ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి పేరు గల రియల్‌మి కంపెనీ గత వారంలో రియల్‌మి GT మరియు రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్ రెండు కొత్త 5G ఫోన్‌లను విడుదల చేసింది. వీటిలో రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ మొదటిసారి Flipkart, Realme.com మరియు ప్రధాన రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 120Hz సూపర్ AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మిడ్-రేంజ్ స్నాప్‌డ్రాగన్ 778G వంటి ఫీచర్లతో పాటుగా సూట్‌కేస్ లాంటి బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్ ధరల వివరాలు
ఇండియాలో రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయడానికి మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వెర్షన్ రూ.25,999 ధర వద్ద 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మిడ్-రేంజ్ వేరియంట్ రూ.27,999 ధర వద్ద మరియు చివరిగా 12GB RAM + 256GB స్టోరేజ్ హై-ఎండ్ వెర్షన్ ను రూ.29,999 ధర వద్ద ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఇది వాయేజర్ గ్రే కలర్ ఎంపికకు పరిమితం చేయబడింది. అయితే ఫోన్‌లో ఎంచుకోవడానికి కాస్మోస్ బ్లూ మరియు లూనా వైట్ కలర్ లు కూడా ఉన్నాయి.

రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్ సేల్స్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ లో నేడు మధ్యాహ్నం 12PM నుండి మొదలయ్యే రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్ సేల్స్ లో రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్ యొక్క 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ అమ్మకానికి అందుబాటులో లేవు. ఫ్లిప్‌కార్ట్ యొక్క స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ కింద ఫోన్‌లను అందించడానికి Realme కూడా Flipkart తో భాగస్వామ్యం కలిగి ఉంది. దీని కారణంగా కస్టమర్‌లు 70 శాతం ధర తగ్గింపుతో రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్‌ను పొందడానికి అనుమతిస్తుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి.

రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్
రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి రియల్‌మి యుఐ 2.0, ఆండ్రాయిడ్ 11 ఆధారంగా రన్ అవుతుంది. ఇది 6.43-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు 120HZ రిఫ్రెష్ రేటుతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జత చేయబడివస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో f/2.45 లెన్స్‌తో 32-మెగాపిక్సెల్ సోనీ IMX615 కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

Realme GT మాస్టర్ ఎడిషన్ 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్, GPS/ A-GPS, NFC మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఇది 4,300mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 65W సూపర్‌డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ 174 గ్రాముల బరువుతో వస్తుంది.


Click it and Unblock the Notifications








