రియల్‌మి GT నియో 2 ఫ్లిప్‌కార్ట్ మొదటి సేల్ లో రూ.7000 వరకు డిస్కౌంట్ ఆఫర్స్!! మిస్ అవ్వకండి

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి ఇండియాలో ఇటీవల రియల్‌మి GT నియో 2 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఫ్లిప్‌కార్ట్ లో ప్రారంభం అవుతున్న బిగ్ దీపావళి సేల్‌ లో అక్టోబర్ 17 ఉదయం 12AM నుండి వినియోగదారులు కొనుగోలు చేయడం కోసం మొదటిసారి అందుబాటులోకి రానున్నది. 120Hz సూపర్ AMOLED డిస్‌ప్లేలతో పాటుగా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 65W ఫాస్ట్ ఛార్జింగ్, మరియు థర్మల్ స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ ప్లస్ హీట్-సింక్ ఛాంబర్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు వంటి ఫీచర్లను కలిగి ఉండి టాప్-ఆఫ్-లైన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 SOC తో రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి సేల్ లో కొన్ని ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. వీటి గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి GT నియో 2 ధరలు & సేల్ డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు

రియల్‌మి GT నియో 2 ధరలు & సేల్ డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు

భారతదేశంలో రియల్‌మి GT నియో 2 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.31,999 కాగా 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ మోడల్ యొక్క ధర రూ.35,999. ఇది ఇప్పుడు నియో బ్లాక్, నియో బ్లూ మరియు నియో గ్రీన్ వంటి మూడు విభిన్న కలర్ ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కామ్ మరియు దేశంలోని ప్రధాన రిటైల్ స్టోర్‌ల ద్వారా 12am (అర్ధరాత్రి) నుండి విక్రయించబడుతుంది. ఈ పండుగ సీజన్ అమ్మకంలో ఈ ఫోన్ మీద లాంచ్ ఆఫర్‌లు గరిష్టంగా రూ.7,000 వరకు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఈ ఫోన్ అక్టోబర్ 16న మధ్యాహ్నం 12 గంటల నుండి అందుబాటులో ఉంది.

రియల్‌మి GT నియో 2 స్పెసిఫికేషన్స్
 

రియల్‌మి GT నియో 2 స్పెసిఫికేషన్స్

రియల్‌మి GT నియో 2 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై రియల్‌మి UI2.0 తో రన్ అవుతుంది. అలాగే ఇది 6.62-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ శామ్‌సంగ్ e4 డిస్‌ప్లేను 120HZ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు DC డిమ్మింగ్‌తో వస్తుంది. డిస్‌ప్లే 600Hz టచ్ శాంపింగ్ రేటు మరియు HDR10+ మద్దతును కలిగి ఉంది. హుడ్ కింద క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 SOC తో శక్తిని పొందుతూ 12GB ర్యామ్ తో జతచేయబడి వస్తుంది. ఫోన్ 7GB వరకు వర్చువల్ మెమరీ (డైనమిక్ ర్యామ్ విస్తరణ) కి మద్దతు ఇస్తుంది, ఇది మెరుగైన మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని అందించడానికి ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ని ఉపయోగిస్తుంది.

ఫొటోగ్రఫీ

రియల్‌మి GT నియో 2 ఫోన్ యొక్క ఫొటోగ్రఫీ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే ఇది 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, NFC మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. మీరు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా పొందుతారు.అలాగే ఇది 65W సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 36 నిమిషాల్లో ఫోన్‌ను సున్నా నుండి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేస్తుందని పేర్కొన్నారు.

Best Mobiles in India

English summary
Realme GT Neo 2 Smartphone First Sale Starts on Flipkart Big Diwali Sale: Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X