Realme GT Neo 2T లాంచ్ డేట్ వచ్చేసింది ! ఫీచర్లు చూడండి

By Maheswara
|

Realme ఇప్పుడు అధికారికంగా GT నియో 2T లాంచ్ తేదీని ప్రకటించింది. GT నియో 2T ప్రారంభాన్ని ధృవీకరించడానికి బ్రాండ్ తన అధికారిక వీబో హ్యాండిల్‌ని ఎంచుకుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 19 న చైనా స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2.00 గంటలకు (ఉదయం 11:30 IST) లాంచ్ కానుంది. అయితే, హ్యాండ్‌సెట్ యొక్క స్పెసిఫికేషన్‌లను బ్రాండ్ ఇంకా నిర్ధారించలేదు. కానీ, TENAA జాబితా మరియు ఇతర లీక్‌ల ద్వారా విడుదల అయిన వివరాలు మనము తెలుసుకోవచ్చు.

 

Realme GT Neo 2T డిజైన్ ను గమనిస్తే

Realme GT Neo 2T డిజైన్ ను గమనిస్తే

డిజైన్ పరంగా, రియల్‌మే జిటి నియో 2 టి మునుపటి రియల్‌మే జిటి నియో 2 మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంది. రియల్‌మే జిటి నియో 2  అక్టోబర్ 13 న భారతదేశంలో విడుదల కానుంది. మరోవైపు, GT సిరీస్ యొక్క ఇతర పరికరాలతో పోలిస్తే ఫోన్ వేరే డిజైన్‌ను కలిగి ఉంటుందని కొన్ని పుకార్లు సూచిస్తున్నాయి. కాబట్టి, అధికారిక సమాచారం వెలువడే వరకు కచ్చితమైన డిజైన్ ను అంచనా వేయలేము.ఇప్పటివరకు విడుదల అయిన డిజైన్ వివరాలు చూస్తే ఇవి అంచనా డిజైన్ గా పరిగణించవచ్చు.

Realme GT Neo 2T అంచనా ఫీచర్లు
 

Realme GT Neo 2T అంచనా ఫీచర్లు

రియల్‌మే జిటి నియో 2 టి 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని చెప్పబడింది. ఇది 12GB RAM వరకు మరియు 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడుతుంది. ఇంకా, రియల్‌మే జిటి నియో 2 టి ఆండ్రాయిడ్ 12-ఆధారిత రియల్‌మి యుఐ 3.0 ని రన్ చేయవచ్చు మరియు 4,500 mAh బ్యాటరీ యూనిట్‌ను ప్యాక్ చేయవచ్చు.ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కెమెరా విషయానికి వస్తే, హ్యాండ్‌సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది, ఇందులో 64MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP సెన్సార్ ఉంటాయి. ముందువైపు, ఈ ఫోన్ 16MP సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Realme GT Neo 2T: ఇండియా లాంచ్ ఎప్పుడు

Realme GT Neo 2T: ఇండియా లాంచ్ ఎప్పుడు

ఇండియా లాంచ్ విషయానికొస్తే, ఈ హ్యాండ్‌సెట్ (టిప్‌స్టర్ ముకుల్ శర్మ ద్వారా) కంపెనీ ఇండియన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ డివైజ్ త్వరలో భారతదేశం లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు, ఇండియా లాంచ్ యొక్క ఖచ్చితమైన వివరాల కోసం అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. అలాగే Realme GT Neo 2T యొక్క ముందు వెర్షన్ అయిన Realme GT Neo2 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అక్టోబర్ 13 న మధ్యాహ్నం 12:30 PM IST కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Realme GT Neo2

Realme GT Neo2

రియల్‌మే జిటి నియో 2 యొక్క ఇతర ఫీచర్ల ను గమనిస్తే , 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్ 65W సూపర్‌డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్ రియల్‌మీ యుఐ 2.0, మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 64 ఎంపి ప్రైమరీ సెన్సార్, 8 ఎంపి అల్ట్రా- వైడ్ లెన్స్, మరియు 2MP మాక్రో షూటర్ ను కలిగి ఉంది. ఇక డిస్ప్లే విషయాలు గమనిస్తే డిస్‌ప్లే 6.62-అంగుళాలు మరియు చిప్‌సెట్ 12GB RAM మరియు 256GB వరకు డిఫాల్ట్ స్టోరేజ్‌తో జత చేయబడుతుంది. కనెక్టివిటీ కోసం, పరికరం 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఛార్జింగ్ కోసం మరియు భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఫోన్ దేశంలో మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో వచ్చినట్లు నిర్ధారించబడింది.

Best Mobiles in India

English summary
Realme GT Neo 2T Launch Confirmed On October 19. India Launch Yet To Confirm.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X