రియల్‌మి GT నియో 3 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

|

రియల్‌మి స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇండియాలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ గా రియల్‌మి GT నియో 3 ని నేడు విడుదల చేసింది. గేమింగ్-ఫోకస్డ్ ఫీచర్లతో రియల్‌మి GT నియోకు అప్ గ్రేడ్ గా స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో విడుదలైన ఈ తాజా ఫోన్ హుడ్ కింద మీడియాటెక్ మెరియెన్సిటీ 8100 5G Soc చేత శక్తిని పొందుతూ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ మరియు 120Hz రిఫ్రెష్ రేటుతో 6.7-అంగుళాల 2K డిస్ప్లే వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. 150W అల్ట్రాడార్ట్ ఛార్జింగ్, మరియు మరొకటి 80W సూపర్ డార్ట్ ఛార్జింగ్ మద్దతుతో వరుసగా 4,500mAh మరియు 5,000mAh బ్యాటరీలతో రెండు వేరియంట్లలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి GT నియో 3 ధరల వివరాలు

రియల్‌మి GT నియో 3 ధరల వివరాలు

భారతదేశంలో రియల్‌మి GT నియో 3 ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్లలో విడుదలైంది. ఇందులో 80W సూపర్ డార్ట్ ఛార్జింగ్ మద్దతుతో లభించే 8GB RAM + 128GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.36,999 కాగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,999. అలాగే 150W అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ వేరియంట్ యొక్క 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ రూ.42,999 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, నైట్రో బ్లూ మరియు స్ప్రింట్ వైట్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది మే 4 నుండి రియల్‌మి.కామ్, ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ దుకాణాల ద్వారా మొదటి సేల్స్ ప్రారంభం కానున్నాయి.

రియల్‌మి GT నియో 3 స్పెసిఫికేషన్స్
 

రియల్‌మి GT నియో 3 స్పెసిఫికేషన్స్

రియల్‌మి GT నియో 3 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 లో రియల్‌మి యుఐ 3.0 తో రన్ అవుతుంది. అలాగే 120HZ రిఫ్రెష్ రేటుతో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,412) డిస్ప్లేను HDR10+ మద్దతుతో కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ మెరిటెక్ 8100 5G SOC తో శక్తిని పొందుతూ 12GB వరకు LPDDR5 RAM తో జత చేయబడి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వేడిని వెదజల్లడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ శీతలీకరణ టెక్నాలజీని కలిగి ఉంది.

ఆప్టిక్స్

రియల్‌మి GT నియో 3 ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్ట్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.88 ఎపర్చరు లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్‌, 119-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు f/2.25 ఎపర్చరు లెన్స్ మరియు f/2.4 ఎపర్చరు లెన్స్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం f/2.45 ఎపర్చరు లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ Samsung S5K3P9 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంది.

కనెక్టివిటీ

రియల్‌మి GT నియో 3 హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్, యాక్సిలరోమీటర్, హాల్ సెన్సార్, మాగ్నెటిక్ సెన్సార్ మరియు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.చివరిగా ఇది 4,500mAh బ్యాటరీ మరియు 150W UltraDart ఛార్జింగ్ సపోర్ట్ మరియు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో కూడిన రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 5 నిమిషాలలోనే బ్యాటరీని 50 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. అలాగే 80W సూపర్‌డార్ట్ ఛార్జర్ 32 నిమిషాల్లోనే ఫోన్ ని పూర్తిగా ఛార్జ్ చేస్తుందని రియల్‌మి తెలిపింది.

Best Mobiles in India

English summary
Realme GT Neo 3 Launched in India With 150W UltraDart Fast Charging Technology: Price, Specs, Sale Date, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X