Realme GT Neo 3T లాంచ్ తేదీ ఖ‌రారైంది.. పూర్తి వివ‌రాల‌కు చూడిండి!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ కంపెనీ Realme, త‌మ GT Neo 3T మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త్వ‌ర‌లోనే భార‌త మార్కెట్‌లో Realme GT Neo 3Tని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. భారతదేశంలో సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 12:30 గంటలకు IST ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ఈరోజు ప్రకటించింది.

Realme GT Neo 3T

ఈ ఏడాది జూన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విష‌యం తెలిసిందే. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుందని ఇటీవ‌ల ల్యాండింగ్ పేజీ వెల్లడించింది. గ్లోబల్ వేరియంట్ మాదిరిగానే భారతీయ వేరియంట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా శక్తిని పొందుతుందని ల్యాండింగ్ పేజీ పేర్కొంది. హ్యాండ్‌సెట్ వెనుక ప్యానెల్ "రేసింగ్ ఫ్లాగ్" డిజైన్‌తో వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది.

సెప్టెంబ‌ర్ 16న లాంచ్‌!
Realme GT Neo 3T భారతదేశంలో సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 12:30 గంటలకు లాంచ్ అవుతుందని కంపెనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. Realme GT Neo 3T స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 870 SoC ప్రాసెస‌ర్ క‌లిగి ఉంద‌ని నిర్ధారించడానికి కంపెనీ ల్యాండింగ్ పేజీని నవీకరించింది. ఫోన్ 5G కనెక్టివిటీని కూడా కలిగి ఉంటుంది.

ల్యాండింగ్ పేజీ ప్రకారం, కంపెనీ రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ యొక్క మరిన్ని స్పెసిఫికేషన్‌లను వెల్లడిస్తుంది. సెప్టెంబర్ 10న, Realme డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌ను ప్ర‌క‌టిస్తుంది, సెప్టెంబర్ 12న, కూలింగ్ సిస్ట‌మ్ గురించిన వివరాలు ప్రకటించబడతాయి, ఆ తర్వాత సెప్టెంబర్ 13న ఫోన్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్‌లను వెల్లడిస్తారు. కంపెనీ ప్రకారం, వెనుక భాగం ప్యానెల్ "రేసింగ్ ఫ్లాగ్" డిజైన్‌ను కలిగి ఉన్న‌ట్లు స‌మాచారం.

Realme GT Neo 3T

Realme GT Neo 3T గ్లోబ‌ల్ వేరియంట్ స్పెసిఫికేష‌న్లు:
Realme GT Neo 3T జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది. ఈ గ్లోబల్ వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62-అంగుళాల E4 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే గరిష్టంగా 1,300 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది HDR10+ సపోర్ట్‌ని కూడా కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ప్రాసెస‌ర్‌, Adreno 650 GPU మరియు 8GB RAM క‌లిగి ఉంది.

ఇక కెమెరాల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఫోన్ 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను క‌లిగి ఉంది. Realme GT Neo 3T యొక్క గ్లోబల్ వేరియంట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh స‌మ‌ర్థ‌వంత‌మైన బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Realme GT Neo 3T

అదేవిధంగా, రియ‌ల్‌మీ కంపెనీ నుంచి గ‌త నెల‌లో విడుద‌లైన Realme 9i 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గురించి కూడా తెలుసుకుందాం:
రియల్‌మి 9i 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది లేజర్ లైట్ డిజైన్‌ను కలిగి ఉండడమే కాకుండా మెటాలిక్ గోల్డ్ మరియు రాకింగ్ బ్లాక్ వంటి రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది 8.1mm స్లిమ్ బాడీని కలిగి ఉండి కేవలం 187గ్రా బరువును కలిగి ఉంటుంది. ఇది 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.6-అంగుళాల 90Hz అల్ట్రా స్మూత్ డిస్‌ప్లేను 2400×1080 పిక్సెల్‌ల ఫుల్ HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 810 5G సిస్టమ్-ఆన్-చిప్ మరియు Arm Mali-G57 MC2 GPU ద్వారా రన్ అవుతూ గరిష్టంగా 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 12-ఆధారిత Realme UI 3.0తో రన్ అవుతుంది.

Realme GT Neo 3T

రియల్‌మి 9i 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP అల్ట్రా HD ప్రైమరీ లెన్స్, 4cm మాక్రో సెన్సార్ మరియు పోర్ట్రెయిట్ షూటర్ కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి.

రియల్‌మి 9i 5G స్మార్ట్‌ఫోన్‌ గరిష్టంగా 128GB స్టోరేజ్ ని కలిగి ఉండి మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, GPS/AGPS మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో మాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5G కనెక్టివిటీ, సామీప్యత మరియు యాక్సిలరేషన్ సెన్సార్‌లు ఉన్నాయి. చివరిగా ఇది 18W క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ మొబైల్ ప్ర‌స్తుతం 4జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ క‌లిగిన వేరియంట్ రూ.12,999 ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Realme GT Neo 3T Will Launch in India on September 16: All Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X