Home
News

రియల్ మీ నుంచి కొత్త ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్లు

By Maheswara

రియల్ మీ ఇటీవలే రియల్ మీ GT నియో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పుడు, త్వరలోనే రియల్ మీ GT నియో 5 SE అనే స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేయబోతోంది. ప్రత్యేకించి ఈ ఫోన్ యొక్క లీక్ అయిన కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ పై భారీ అంచనాలను సృష్టించింది.

రియల్ మీ GT నియో 5 SE స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, పెద్ద డిస్‌ప్లే, నాణ్యమైన కెమెరాతో సహా పలు ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుంది. మరియు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయిన రియల్ మీ GT నియో 5 SE స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను పూర్తిగా పరిశీలిద్దాం.

Realme GT Neo 5 SE 5G Expected To Launch Soon, Specifications Leaked Ahead Of The Launch.

రియల్ మీ GT నియో 5 SE ఫీచర్లు
రియల్ మీ GT నియో 5 SE స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2772x1240 పిక్సెల్‌లు, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ బ్రైట్‌నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ మరియు అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

రియల్ మీ GT నియో 5 SE స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ జెన్ 1 చిప్‌సెట్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ప్రత్యేకంగా, ఈ ఫోన్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా లాంచ్ చేయబడుతుంది అని అంచనాలున్నాయి.

ఈ రియల్ మీ GT నియో 5 SE స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో 64MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ + 2MP డెప్త్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. ఇది LED ఫ్లాష్ మరియు ఇతర కెమెరా ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

Realme GT Neo 5 SE 5G Expected To Launch Soon, Specifications Leaked Ahead Of The Launch.

కొత్త రియల్ మీ GT నియో 5 SE స్మార్ట్ ఫోన్ 8GB/12GB RAM మరియు 128GB/256GB స్టోరేజ్ సపోర్ట్‌తో లాంచ్ చేయబడుతుంది. ఈ కొత్త రియల్ మీ ఫోన్ మెమరీ విస్తరణకు కూడా అవకాశం కల్పిస్తుంది. మీరు మెమరీ కార్డ్‌ని ఉపయోగించడానికి మైక్రో SD కార్డ్ స్లాట్ సపోర్ట్‌తో ఈ కొత్త రియల్ మీ ఫోన్ లాంచ్ అవుతుంది.

రియల్ మీ GT నియో 5 SE స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీతో రాబోతోంది. కాబట్టి ఛార్జింగ్ గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ ఎక్కువకాలం బ్యాటరీ బ్యాకప్ ను అందిస్తుంది. మరియు ఈ ఫోన్‌లో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. కాబట్టి ఈ ఫోన్ కొన్ని నిమిషాల్లోనే పూర్తి ఛార్జ్ అవుతుంది.

Realme GT Neo 5 SE 5G Expected To Launch Soon, Specifications Leaked Ahead Of The Launch.

కనెక్టివిటీ ఫీచర్లు
ముఖ్యంగా, ఈ కొత్త ఫోన్‌లో 5G, 4G వోల్ట్, USB టైప్-సి పోర్ట్, Wi-Fi, GPS, 3.5mm ఆడియో జాక్‌తో సహా అనేక కనెక్టివిటీ సపోర్ట్‌లు ఉన్నాయి. మరియు ఈ రియల్ మీ GT నియో 5 SE స్మార్ట్‌ఫోన్ కొంచెం ఎక్కువ ధరతో వస్తుంది. అయితే ఈ ఫోన్ ధరకు తగ్గట్టుగానే అన్ని ఫీచర్లను కలిగి ఉంది.

అలాగే, రియల్ మీ ఈ సంవత్సరం అనేక అద్భుతమైన 5G ఫోన్‌లను విడుదల చేయబోతోంది. వివో మరియు మోటో ఫోన్లకు గట్టి పోటీగా రియల్ మీ 5G ఫోన్‌లను విడుదల చేస్తోంది. అలాగే, వినియోగదారులలో కూడా రియల్ మీ ద్వారా లాంచ్ చేయబడిన అన్ని ఫోన్‌లు భారతదేశంలో మంచి ఆదరణ పొందాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT Neo 5 SE 5G Expected To Launch Soon, Specifications Leaked Ahead Of The Launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X