ఏప్రిల్ 3 న లాంచ్ కాబోయే రియల్ మీ ఫోన్ డిజైన్ లీక్! స్పెసిఫికేషన్లు
రియల్ మీ GT నియో 5 SE లాంచ్ తేదీ ఏప్రిల్ 3న చైనాలో లాంచ్ చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్ణయించారు. ప్రముఖ, సోషల్ మీడియా సంస్థ అయిన వెబో ద్వారా దేశంలో కొత్త రియల్ మీ GT సిరీస్ స్మార్ట్‌ఫోన్ రాకను కంపెనీ ధృవీకరించింది. రియల్ మీ తన చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఖాతా లో అనేక పోస్టర్‌లను షేర్ చేసింది.
ఈ పోస్టర్ లు, స్మార్ట్‌ఫోన్ యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్‌ల వివరాలను వెల్లడిస్తాయి. రాబోయే రియల్ మీ GT నియో 5 SE కోసం పోస్టర్లు వంపు కలిగిన అంచులు మరియు ట్రిపుల్ వెనుక కెమెరాలను సూచిస్తున్నాయి. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రియల్ మీ GT నియో 5 SE స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 2 SoC ద్వారా శక్తిని పొందుతుంది మరియు 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

రియల్ మీ సంస్థ తన అధికారిక వెబో ఖాతా ద్వారా, రియల్ మీ GT నియో 5 SE లాంచ్ ను బుధవారం ప్రకటించింది. ఇది ఏప్రిల్ 3న ప్రారంభించబడుతుంది అని తెలుస్తోంది. మరియు లాంచ్ ఈవెంట్ చైనాలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు (11:30 am IST) జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు రియల్ మీ GT నియో 5 మాదిరిగానే డిజైన్ లాంగ్వేజ్‌ని సూచిస్తున్నాయి. ఇది వంపు అంచులతో చూపబడింది మరియు ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌లో అమర్చబడింది.
రియల్ మీ GT నియో 5 SE 1TB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీ తో స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 2 SoCని కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్ మొత్తం AnTuTu టెస్ట్ స్కోర్ 1,009,127ని కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. త్వరలో లాంచ్ కాబోయే ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,500mAh బ్యాటరీకి మద్దతు ఇస్తుంది.
ఇంతకు ముందే లీక్ అయిన సమాచారం ప్రకారం, రియల్ మీ GT నియో 5 SE ఫోన్ 16GB LPDDR5x RAMని కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 తో వస్తుంది. మరియు, 6.74-అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లే, 2160Hz PWM డిమ్మింగ్ మరియు 1,100 nits గరిష్ట ప్రకాశంతో ఉంటుంది.
రియల్ మీ GT నియో 5 SE యొక్క కెమెరా యూనిట్ వివరాలు గమనిస్తే, ఈ ఫోన్ 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దాని తర్వాత 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ఇంకా, ఇది 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇటీవలే ఇండియా లో రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే.ఈ ఫోన్ ధరలు రూ.10,999 నుంచి మొదలవుతాయి.


Click it and Unblock the Notifications








