రియల్‌మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!

By Maheswara
|

రియల్‌మీ GT నియో 5 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 9, 2023న చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గత సంవత్సరం రియల్‌మీ GT నియో 3 కి కొనసాగింపుగా వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మీ ఈ ఏడాది చివర్లో భారతదేశంలో కూడా ఈ GT నియో 5ని విడుదల చేసే అవకాశం ఉంది అని అంచనాలున్నాయి.ఈ లాంచ్‌కు ముందే, ఇప్పటికే రియల్‌మీ ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క డిజైన్‌ను టీజర్ రూపంలో విడుదల చేసింది.

 
Realme GT Neo 5 To Launch On February 9th, With 240W Fast Charging Feature More Details In Telugu.

రియల్‌మీ GT నియో 5 డిజైన్

 

రియల్‌మీ GT నియో 5 స్మార్ట్ ఫోన్ యొక్క తాజా టీజర్ వివరాల ప్రకారం ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కొత్త పర్పుల్ ఫాంటసీ కలర్ వేరియంట్‌లో విడుదల చేయబడుతుందని తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ మ్యాట్ ఫినిష్ ను కలిగి ఉంది మరియు దీని ప్యానెల్‌ వంపు తిరిగి ఉంటుంది. ఇంకా డిజైన్ విషయాలు గమనిస్తే, ఎగువన రెండు వృత్తాకార కెమెరా కటౌట్‌ల వద్ద దీర్ఘచతురస్రాకార ద్వీపం కూడా ఉంటుంది.ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంది, పైభాగంలో ప్రాథమిక కెమెరా మరియు దిగువన రెండు కెమెరాలు ఉన్నాయి.

Realme GT Neo 5 To Launch On February 9th, With 240W Fast Charging Feature More Details In Telugu.

రియల్‌మీ GT నియో 5 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు

రియల్‌మీ GT నియో 5 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 16GB వరకు LPDDR5 RAMతో ఉంటుంది. GT నియో 5 ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.7-ఇంచుల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని పుకారు ఉంది. ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది.

Realme GT Neo 5 To Launch On February 9th, With 240W Fast Charging Feature More Details In Telugu.

ఇక ఈ ఫోన్ యొక్క కెమెరా సామర్థ్యాల విషయానికొస్తే, రియల్‌మీ GT నియో 5 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి మద్దతుతో Sony IMX890 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మాక్రో లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే, GT నియో 5 స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంటుంది.ఈ స్మార్ట్‌ఫోన్ 240W SuperVOOC ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. ఈ ఛార్జర్ కేవలం 30-సెకన్ల ఛార్జ్ తర్వాత 2 గంటల వరకు కాలింగ్ సమయాన్ని అందించేలా ఛార్జింగ్ చేయగలదు అని రియల్‌మీ ప్రకటనలో పేర్కొంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, Realme GT Neo 5 ఫోన్ లో Realme UI 4.0 తో ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ బాక్స్‌ని కలిగి ఉంటుంది.

Realme GT Neo 5 To Launch On February 9th, With 240W Fast Charging Feature More Details In Telugu.

రియల్‌మీ-కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్

ఇటీవలే,వార్త సమాచారం ప్రకారం ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ ఐకానిక్ కోకా-కోలా బ్రాండింగ్ మరియు డిజైన్ థీమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి ఆలోచిస్తోంది.ఈ ప్రాజెక్ట్ కోసం శీతల పానీయాల కంపెనీ కోకా-కోలా చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Realme తో కలిసి పని చేస్తుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నారు. Realme ఇప్పుడు భారతదేశంలోని తన వెబ్‌సైట్‌లో కోకా-కోలా స్మార్ట్‌ఫోన్‌ను టీజర్ ను విడుదల చేయడం ప్రారంభించినందున ఈ పుకార్లు కూడా నిజమని తేలింది. Realme తన అధికారిక వెబ్‌సైట్‌లో రెండు టీజర్‌లను షేర్ చేసింది, ఇది కోకాకోలా స్మార్ట్‌ఫోన్ లాంచ్ దగ్గర్లోనే ఉందని సూచిస్తుంది. ఈ టీజర్ ల యొక్క ఫోటోలలో ఒకటి ట్యాగ్‌లైన్‌తో వస్తుంది- "Realme నిజంగా రిఫ్రెష్ పొందడానికి నిర్ణయించబడింది." మరో టీజర్‌లో "నిజంగా చీర్స్ చెప్పడానికి సిద్ధంగా ఉండండి" అని ట్యాగ్ లైన్ తో వస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Realme GT Neo 5 To Launch On February 9th, With 240W Fast Charging Feature More Details In Telugu.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X