Home
News

Realme GT Neo 6 యొక్క ధర వివరాలు లీక్ అయ్యాయి!

By Maheswara

Realme సంస్థ త్వరలో Realme GT నియో 6 ని లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు, అయినప్పటికీ కంపెనీ దాని గురించి అధికారికంగా ఇంకా ఏమీ ప్రకటించలేదు. అయితే, 16GB RAM, 5,000mAh బ్యాటరీ మరియు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సహా రాబోయే GT నియో సిరీస్ హ్యాండ్‌సెట్ గురించి గత వారాల్లో చాలా లీక్‌లు వెలువడ్డాయి.

ఇప్పుడు, ఒక టిప్‌స్టర్ Realme GT Neo 6 యొక్క అంచనా ధరలను కూడా సూచించాడు. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC ప్రాసెసర్ తో వస్తుంది. ఒక చైనీస్ టిప్‌స్టర్ Realme GT Neo 6 యొక్క ధర వివరాలను లీక్ చేసారు. అతని వైబో పోస్ట్ ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్ ధర CNY 2,000 (దాదాపు రూ. 22,000) కంటే తక్కువగా ఉంటుంది. ఇంకా, ఇది అల్యూమినియం ఫ్రేమ్‌ని కలిగి ఉందని మరియు స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC పై పనిచేస్తుందని చెప్పబడింది.

Realme GT Neo 6 Price Leaked. Expected To Feature With Snapdragon 8 Gen 2 SoC And Other Specs Here

గత లీక్‌ల ప్రకారం, Realme GT Neo 6 లో మీడియా టెక్ డైమెన్సిటీ 9200+ SoC ప్రాసెసర్ ని సూచించాయి. 16GB RAM మరియు 1TB ఆన్‌బోర్డ్ స్టోరేజీ తో జత చేయబడింది. ఇది 1.5K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని లీక్ లు చెబుతున్నాయి. ఇది 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

రాబోయే Realme GT Neo 6 స్మార్ట్ ఫోన్ Realme GT Neo 5 కు కొనసాగింపు గా లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. నియో 5 ఫోన్ ఫిబ్రవరిలో చైనాలో రెండు ఛార్జింగ్ ఆప్షన్లతో లాంచ్ చేయబడింది.అవి, 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న వేరియంట్ 16GB RAM + 256GB స్టోరేజ్ కోసం CNY 3,199 (దాదాపు రూ. 39,000) ఖర్చవుతుంది. అయితే, 150W వేరియంట్ CNY 2,499 (దాదాపు రూ. 30,400) మోడల్ 8GB RAM + 256GB స్టోరేజి తో వస్తుంది.

Realme GT Neo 5 యొక్క స్పెసిఫికేషన్ల వివరాలు గమనిస్తే,144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 SoC ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి.

ఇక సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, 16-మెగాపిక్సెల్ శాంసంగ్ S5K3P9 సెన్సార్ ఉంది. ఈ రియల్ మీ ఫోన్ యొక్క 240W వేరియంట్‌లో 4,600mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే, 150W వేరియంట్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT Neo 6 Price Leaked. Expected To Feature With Snapdragon 8 Gen 2 SoC And Other Specs Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X