Home
News

Realme కొత్త ఫోన్ వివరాలు లీక్‌.. ట్రిపుల్‌ కెమెరా, 6.78 అంగుళాల డిస్‌ప్లే..?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ త్వరలో Realme GT5 Pro స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్ కొన్ని కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్ ఆధారంగా పనిచేయనుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం ఆగస్టులో Realme GT5 ఫోన్ విడుదల అయింది.

రియల్‌మీ GT5 ప్రో ఊహించిన స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5k OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 9.2 అంగుళాల మందం, 220 గ్రాముల బరువును కలిగి ఉంటుందని సమాచారం.

Realme GT5 Pro phone details leaked

రియల్‌మీ GT5 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Realme New Smartphone) డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ మూడో జనరేషన్‌ 8 సిరీస్‌ చిప్‌తో పాటు అడెన్నో 750 GPUపైన ఆధారపడే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్‌ 14 OS : ఈ స్మార్ట్‌ఫోన్‌ 16GB LPDDR5X ర్యామ్‌ మరియు 1TB UFS 4.0 స్టోరేజీని సపోర్టుచేసే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ UI 5 అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్ OSను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 12GB, 16GB ర్యామ్‌లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Realme GT5 Pro phone details leaked

రియల్‌మీ GT5 ప్రో బ్యాటరీ, కనెక్టివిటీ : బ్యాటరీ విషయానికి వస్తే రియల్‌మీ GT5 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 100W సూపర్‌వాక్‌ వైర్‌ ఛార్జర్‌, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5260mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వైఫై 7, బ్లూటూత్‌ 5.4 NFC మరియు USB-C పోర్టును కలిగి ఉంటుంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ఫ్రింట్‌ రీడర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

రియల్‌మీ GT5 ప్రో కెమెరాలు : ఈ స్మార్ట్‌ఫోన్ OIS - ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 50MP టెలీఫోటో కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ముందువైపు సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

రియల్‌మీ GT5 ప్రో ధర : ఈ స్మార్ట్‌ఫోన్ ధరపై ఎటువంటి సమాచారం లేకున్నా.. సుమారు 50 వేల రూపాయలపైగా ఉండే అవకాశం ఉంది. అయితే భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, డిజైన్‌, ధరపై రియల్‌మీ సంస్థ ఎటువంటి స్పష్టత లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ వచ్చే నెలలో చైనాలో లాంచ్‌ కానుంది. అయితే భారత్‌లో ఎప్పుడు విడుదల కానుందనే సమాచారం అందుబాటులో లేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT5 Pro specs leaked may debut india soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X