Realme నుంచి కొత్త laptop ..! డిజైన్ లో Apple తో పోటీగా ఉంది ..?

By Maheswara
|

Realme ఇప్పటికే భారతదేశంలో మొత్తం చాల రకాల పరికరాలను విడుదల చేసింది, కాని ల్యాప్‌టాప్ రంగంలో ఇంకా అడుగుపెట్టలేదు. ఇది త్వరలో మారడానికి సిద్ధంగా ఉంది. అంటే త్వరలో కంపెనీ ల్యాప్‌టాప్ విభాగంలోకి అడుగులు వేస్తుంది. మరియు తమ మొదటి ల్యాప్‌టాప్ ను విడుదల చేయనుంది. Realme సీఈఓ మాధవ్ శేత్ ఒక చిన్న టీజర్‌ను ట్వీట్ చేస్తూ ల్యాప్‌టాప్‌లో తమ ప్రొడక్ట్ లిస్టులో చేరనున్నట్లు సూచించాడు.

 

Realme యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)

వన్‌ప్లస్ నార్డ్ CE 5G ధరలు, ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్ వేయండి...
Realme యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మాధవ్ శేత్ సంస్థ రాబోయే పరికరాన్ని ట్విట్టర్‌లో టీజర్ ని  పంచుకున్నారు. ఈసారి, అయితే, ఉత్పత్తి స్మార్ట్‌ఫోన్ కాదు, Realme Laptop . "హలో వరల్డ్!" అని అనువదించే సీక్రెట్ సందేశంతో  ల్యాప్‌టాప్ యొక్క సమాచారాన్ని పంచుకున్నారు. టీజ చేసిన ల్యాప్‌టాప్ వాస్తవానికి రాబోయే మోడల్ కాదా అని మేము ధృవీకరించలేము, కాని కంపెనీ భారతదేశంలో ల్యాప్‌టాప్ విభాగంలోకి ప్రవేశిస్తోందని స్పష్టమవుతోంది.

Also Read:వన్‌ప్లస్ నార్డ్ CE 5G ధరలు, ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్ వేయండి...Also Read:వన్‌ప్లస్ నార్డ్ CE 5G ధరలు, ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్ వేయండి...

ల్యాప్‌టాప్ మార్కెట్లోకి

ల్యాప్‌టాప్ మార్కెట్లోకి

BBK ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలోని చైనీస్ బ్రాండ్, స్మార్ట్‌ఫోన్‌లతో విజయవంతంగా పరుగులు తీసిన తర్వాత ల్యాప్‌టాప్ మార్కెట్లోకి ప్రవేశించిన మొదటిది కాదు. ఇది వరకే చైనీస్ బ్రాండ్ అయినా షియోమి తన మొదటి ల్యాప్‌టాప్‌ను గత ఏడాది ఇదే సమయంలో లాంచ్ చేసింది, ఇప్పుడు రియల్‌మే ఈ క్లబ్‌లో చేరే సమయం వచ్చింది.

 

ఫాలోయర్స్ ని

రియల్‌మీ  తన ల్యాప్‌టాప్‌ను భారతదేశంలో లాంచ్ చేసే పనిలో కొంతకాలంగా ఉంది.షెత్ పంచుకున్న చిత్రం ప్రకారం ఆలోచిస్తే, ల్యాప్‌టాప్ ముగింపు ఆపిల్ మాక్‌బుక్స్‌తో సమానంగా కనిపిస్తుంది. రాబోయే ఉత్పత్తి పేరును ఊహించమని అయన తన ఫాలోయర్స్ ని అడిగారు. రియల్‌మీ ల్యాప్‌టాప్‌లను జూన్‌లో లాంచ్ చేయవచ్చని జనవరిలో టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఇంతకు ముందే తెలియచేసారు.

ల్యాప్‌టాప్ మార్కెట్లో డిమాండ్

ల్యాప్‌టాప్ మార్కెట్లో డిమాండ్

ల్యాప్‌టాప్‌ను ప్రారంభించడానికి రియల్‌మీ  యొక్క సమయం కొంచెం ఆలస్యం అయి ఉండవచ్చు, కాని ల్యాప్‌టాప్ మార్కెట్లో ఇంకా అవకాశాలు ఉన్నాయి . కాబట్టి, ల్యాప్‌టాప్‌ల డిమాండ్ ఎప్పుడైనా త్వరలో పరిష్కరించే అవకాశం లేదు. మహమ్మారి దెబ్బతిన్నప్పటి నుండి ల్యాప్‌టాప్ మార్కెట్‌లో రవాణా చేయబడిన యూనిట్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించింది.

Also Read:ఒక్కడు చేసిన పనికి ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ డౌన్ ! అమెజాన్ కు సెకనుకు 5 లక్షలు నష్టం.Also Read:ఒక్కడు చేసిన పనికి ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ డౌన్ ! అమెజాన్ కు సెకనుకు 5 లక్షలు నష్టం.

macbook ఎయిర్ లాంటి డిజైన్

macbook ఎయిర్ లాంటి డిజైన్

ఈ టీజర్ macbook ఎయిర్ లాంటి ఫిట్ మరియు ఫినిష్ డిజైన్ ను కలిగి ఉంటుందని సూచిస్తుంది, అయితే చట్రం ప్లాస్టిక్ లేదా అల్యూమినియం కాదా అనేది సమయం మాత్రమే తెలియజేస్తుంది. రియల్‌మీ  ల్యాప్‌టాప్‌లో సన్నని ప్రొఫైల్ కూడా ఉంది. ల్యాప్‌టాప్ సిల్వర్ కలర్‌ వేలో వస్తుందని టీజర్ ధృవీకరించింది. ఈ సమయంలో మరిన్ని వివరాలు భాగస్వామ్యం చేయబడలేదు. ల్యాప్‌టాప్‌ల యొక్క మొదటి బ్యాడ్జ్‌తో వస్తున్నా ఈ రియల్‌మీ లాప్టాప్ ల మోడల్ మరియు స్పెసిఫికేషన్లపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ప్రత్యర్థి షియోమి గత ఏడాది జూన్‌లో భారతదేశంలో తొలి ల్యాప్‌టాప్ (ల) ను విడుదల చేసింది, మి నోట్‌బుక్ 14 మరియు హారిజోన్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌లతో రూ .41,999 నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు realme laptop కూడా ధరలో దీనికి పోటీగా ధర రూ.30 వేల నుండి రూ.50 వేల వరకు వుండవచ్చని అంచనా వేస్తున్నారు. 

Best Mobiles in India

English summary
Realme Laptop To Be Launched In India. Here Are Price, Specs And Other Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X