ధర రూ.8,999కే ఐఫోన్ తరహా డిజైన్, 50MP కెమెరా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ బడ్జెట్ రేంజ్ ఫోన్ Realme Narzo N53ను ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. అయితే రియల్‌మీ ఫోన్ ఐఫోన్ తరహా మోడల్ కలిగి ఉంది. ఇది ప్రధానంగా ఆకట్టుకొనే అవకాశం ఉంది. నార్జో N53 స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ రేంజ్‌లో తీసుకొచ్చిన రియల్‌మీ... బ్యాటరీ, డిస్‌ప్లే, సహా కెమెరాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
రియల్‌మీ నార్జో N53 స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. N53 ఫోన్ కేవలం 30 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ అవ్వగలదని సంస్థ వెల్లడించింది. మరియు ఈ ఫోన్ టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంటుందని తెలిపింది.

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుకవైపు 50MP కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాతో నైట్ మోడ్, పనోరమిక్ మోడ్, ఎక్స్‌పర్ట్ టైంలాప్స్, పొట్రాయిట్ మోడ్, HDR, స్లో మోషన్, సహా AI సీన్ రికగ్నేషన్. వీడియో, ఫోటోలను తీయవచ్చు. మరియు సెల్ఫీల కోసం ఫోన్ ముందువైపు 8MP కెమెరా అమర్చారు.
రియల్‌మీ నార్జో N53 స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. నార్జో N53 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత Unisoc T612 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. కాలిపోర్నియా సన్‌షైన్ డిజైన్‌లో అందుబాటులో ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ Feather Gold మరియు Feather Black రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 150 శాతం ఆల్ట్రా బూమ్ స్పీకర్ల కలిగి ఉంది. మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటుచేశారు.
రియల్‌మీ నార్జో N53 స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4GB ర్యామ్, 64 GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ. 8,999 మరియు 6GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 కు కొనుగోలు చేయవచ్చు. మరియు డైనమిక్ 12GB వరకు ర్యామ్, 2TB వరకు డైనమిక్ స్టోరేజీ పెంచుకొనేందుకు అవకాశం ఉంది.
రియల్‌మీ నార్జో N53 స్మార్ట్‌ఫోన్.. మే 22న Realme.comలో ప్రత్యేక సేల్‌లో తొలుత అందుబాటులో ఉంటుంది. మే 22 మధ్యాహ్నం 2-4 గంటల వరకు ఈ సేల్ కొనసాగుతుంది. అనంతరం మే 24న మధ్యాహ్నం 12 గంటలకు Realme.com, మరియు అమెజాన్‌లో అందరికీ అందుబాటులోకి వస్తుంది.
సేల్‌లో భాగంగా 4GB వేరియంట్‌పై ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులు కలిగినవారు రూ.750 డిస్కౌంట్‌ను పొందుతారు. అదే 6GB వేరియంట్‌పై ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులు కలిగిన వారికి రూ.1000 డిస్కౌంట్ వస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








