రియల్‌మి మాగ్‌డార్ట్ మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్, ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్!!

|

ఇండియాలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి రోజురోజుకి తన యొక్క విస్తరణను పెంచుకుంటోంది. ఈ సంస్థ బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్లను అందిస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నది. ఈ సంస్థ తన యొక్క వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలను తన యొక్క స్మార్ట్‌ఫోన్లలో చేరుస్తున్నది. ఇందులో భాగంగా సంస్థ నుంచి రాబోయే రియల్‌మి మాగ్‌డార్ట్‌ టెక్నాలజీకి సంబందించిన విషయాలను భారతదేశంలో కంపెనీ టీజ్ చేసింది.

మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్

కంపెనీ విడుదల చేసిన టీజర్లో దీని గురించి తెలుపుతూ ఇది ఆండ్రాయిడ్ కోసం లభిస్తున్న మొట్టమొదటి మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీగా చెప్పబడింది. ఇది రియల్‌మి ఫ్లాష్ అని పిలువబడే కొత్త ఫోన్‌తో పాటు త్వరలోనే ఆవిష్కరించనున్నది. ఇది రియల్‌మి నుండి ఈ కొత్త ఛార్జింగ్ టెక్నాలజీతో ప్రవేశపెడుతుంది. ఇది ఆపిల్ యొక్క మాగ్‌సేఫ్ ఛార్జింగ్ టెక్నాలజీతో సమానంగా ఉంటుంది. మాగ్‌డార్ట్ ఛార్జింగ్ పుక్‌తో పాటు రియల్‌మి ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్‌ను రెండర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రియల్‌మి ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో విడుదలఅయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మొబైల్ నంబర్‌ను సేవ్ చేయకుండా వాట్సాప్‌లో మెసేజ్ చేయడం ఎలా?మొబైల్ నంబర్‌ను సేవ్ చేయకుండా వాట్సాప్‌లో మెసేజ్ చేయడం ఎలా?

రియల్‌మి ఇండియా ట్విట్టర్‌

రియల్‌మి ఇండియా ట్విట్టర్‌లో "రియల్‌మిఫ్లాష్" మరియు "కమింగ్ ఇన్ ఫ్లాష్‌" అనే హ్యాష్‌ట్యాగ్ లైన్‌తో మాగ్‌డార్ట్‌ టెక్నాలజీని చూపించే రియల్‌మి ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్ ఫోటోను షేర్ చేసింది. రియల్‌మి ఫ్లాష్‌ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరిస్తుందని మరియు ఇది సరికొత్త మాగ్‌డార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ప్రవేశపెడుతుందని ఇది సూచిస్తుంది. ఈ రియల్‌మి ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మాగ్‌డార్ట్ ఛార్జర్ యొక్క కొన్ని వివరాలను షేర్ చేసిన GSMArena యొక్క నివేదిక దీనికి మద్దతు ఇస్తుంది.

రియల్‌మి ఫ్లాష్ ఫోన్‌

రియల్‌మి ఫ్లాష్ ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌ డిజైన్ తో కూడిన సాధారణ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ లాగా కనిపిస్తుంది. అలాగే ఇది హుడ్ కింద రియల్‌మి ఫ్లాష్ స్నాప్‌డ్రాగన్ 888 SoC చేత శక్తినిపొందుతూ 12GB RAM, 256GB స్టోరేజ్ తో జతచేయబడి ఉండి Realme UI 2.0 తో మరియు Android 11 ను రన్ అవుతుందని చెబుతారు.

మాగ్‌డార్ట్ ఛార్జింగ్ పుక్ ప్యాకేజీ

రియల్‌మి మాగ్‌డార్ట్ ఛార్జింగ్ పుక్ ప్యాకేజీని మరింత ఆసక్తికరంగా చేస్తుంది. ఇది వెనుక భాగంలో వెంటిలేషన్ కలిగిన మందపాటి క్యూబాయిడ్ మరియు రెండర్ వలె ఉంటుంది. నివేదికల ప్రకారం ఇది ఛార్జ్ చేయడానికి ఫోన్ వెనుక భాగంలో అయస్కాంతంగా అంటుకుంటుంది. ఛార్జర్ మరియు ఫోన్ మధ్య కనెక్షన్ వైర్‌లెస్ కావున మాగ్‌డార్ట్ ఛార్జర్‌కు USB టైప్-సి కనెక్షన్ అవసరం ఉండదు. ఇది 15W కంటే ఎక్కువ ఛార్జింగ్ వేగాన్ని అందిస్తుందని చెప్పబడింది మరియు ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మాగ్నెటిక్ ఛార్జర్ అని నివేదిక పేర్కొంది.

రియల్‌మి మాగ్‌డార్ట్

రియల్‌మి మాగ్‌డార్ట్ ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి ఒక ఫ్యాన్ ను కలిగి ఉంటుందని నివేదికలు పేర్కొంది. ఇది ఆపిల్ యొక్క మాగ్‌సేఫ్ ఛార్జర్ కంటే చాలా మందంగా ఉంటుంది మరియు ఎక్కువ వైర్‌లెస్ ఛార్జింగ్ వేగాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతానికి మాగ్‌డార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ రియల్‌మి ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్ కోసం మాత్రమే అని తెలుస్తోంది. అయితే రియల్‌మి సంస్థ వీటి యొక్క విడుదల తేదీని ఇంకా విడుదల చేయలేదు. రాబోయే రోజుల్లో దీనికి సంబందించిన మరింత సమాచారం ఆశించవచ్చు.

Best Mobiles in India

English summary
Realme MagDart Magnetic Wireless Charging Tech, Realme Flash Smartphone Leaks: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X