గ్రేట్ న్యూస్: రియల్‌మి ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు
ఇండియాలో ఈసారి దసరా మరియు దీపావళి రెండు పండుగలు ఒకే నెలలో వస్తున్నాయి. ప్రముఖ ఈ-కామెర్స్ ఫ్లిప్‌కార్ట్ ఈ పండుగ సీజన్ను ఒక వారం ముందే మనకు పరిచయం చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 వరకు హోస్ట్ చేస్తున్నది. ఇందులో భాగంగా రియల్‌మి స్మార్ట్‌ఫోన్లపై బారిగా డిస్కౌంట్ లను అందిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సందర్బంగా కొన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా ఇ-కామర్స్ తన వెబ్‌సైట్‌లో కొన్ని రియల్‌మి ఫోన్‌లను తగ్గింపు ధరతో జాబితా చేసింది. 20వేల లోపు సెగ్మెంట్లలో ట్రిపుల్ కెమెరా సెటప్ లతో గల రియల్‌మి ఫోన్లు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. మీలో ఎవరైనా రియల్‌మి ఫోన్లను కొనదలచుకుంటే ఇదే మంచి తరుణం త్వరపడండి.

48MP మెయిన్ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రెండు ఫోన్లను కలిగి ఉండగా రియల్‌మి ఎక్స్‌టితో మొదటిసారిగా 64MP సెన్సార్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. రియల్‌మి ఫోన్లు పెద్ద బ్యాటరీలు Vooc ఛార్జింగ్ టెక్నాలజీతో మరియు పెద్ద పెద్ద డిస్ప్లే లతో వస్తాయి. తగ్గింపు ఆఫర్లతో వస్తున్న రియల్‌మి ఫోన్లు కింద ఇవ్వబడ్డాయి. వాటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C2
రియల్‌మి C2 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్ లలో వస్తుంది. ఇందులో 2GB/32GB మోడల్ రూ.5,999లకు మరియు 3GB/32GB మోడల్ రూ.6,999ల ధర వద్ద లభిస్తుంది. రియల్‌మి C2 13Mp+2Mp డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. అదనపు డిస్కౌంట్ లలో భాగంగా రూ.1,000 డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

రియల్‌మి 5
రియల్‌మి5 యొక్క 4GB RAM / 128GB ROM వేరియంట్‌ను రూ.11,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. క్వాడ్-రియర్ కెమెరా సెటప్, 5,000 mAh బ్యాటరీ మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC దీని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 5% అదనపు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

రియల్‌మి 5 ప్రో
రియల్‌మి 5 ప్రో క్వాడ్-కెమెరా సెటప్ తో గల స్మార్ట్‌ఫోన్. దీనిని ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో 6GB RAM / 64GB స్టోరేజ్ మోడల్ కేవలం రూ. 12,999లకు అందిస్తుంది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 5% క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుంది.

రియల్‌మి X
48Mp ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో గల ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో 8GB RAM / 128 GB స్టోరేజ్ మోడల్ తగ్గింపు ధరతో కేవలం రూ.15,999 లకు లభిస్తుంది. అంతేకాకుండా HDFC బ్యాంక్ డెబిట్ కార్డుల కొనుగోలుపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

రియల్‌మి XT
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో రియల్‌మి XT రూ. 1,000 డిస్కౌంట్ తో దాని బేస్ వేరియంట్‌ను రూ.15,999లకు అందుబాటులో ఉంది. ఇతర డిస్కౌంట్ల విషయంలో నో-కాస్ట్ EMI, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పై 5% క్యాష్‌బ్యాక్ మరియు HDFC బ్యాంక్ డెబిట్ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇందులో 64Mp ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ప్రత్యేక ఆకర్షణ.

రియల్‌మి 2ప్రో
రియల్‌మి 2ప్రో స్మార్ట్ ఫోన్ రూ.5,000 తగ్గింపు పొంది ఇప్పుడు కేవలం రూ.8,999లకు లభిస్తున్నది. దీని ప్రత్యకతలు స్నాప్‌డ్రాగన్ 660 మరియు 16MP సెల్ఫీ సెన్సార్. స్మార్ట్ఫోన్‌ను నో-కాస్ట్ EMI ప్లాన్‌లతో పొందవచ్చు. అంతేకాకుండా ఎక్స్చేంజ్ పై రూ.10,500 వరకు తగ్గింపు పొందవచ్చు.

రియల్‌మి 3i
రియల్‌మి 3i యొక్క 4GB RAM మోడల్ ఇప్పుడు రూ.7,999ల ప్రత్యేక ధర వద్ద లభిస్తుంది.13MP+2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 13MP సెల్ఫీ కెమెరా గల రియల్‌మి 3i ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








