రియల్‌మి నార్జో 10A కొనుగోలుకు సరైన సమయం ఇదే!!!

|

ఇండియాలో లాక్ డౌన్ సమయంలో రూ .8,999 బడ్జెట్ ధరలో విడుదలైన రియల్‌మి నార్జో 10A యొక్క అమ్మకాలు ఈ రోజు మళ్ళి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలయ్యాయి. ఎప్పటిలాగే ఈ-కామర్స్ సైట్‌లో మధ్యాహ్నం 12:00 గంటల నుంచి ఈ అమ్మకాలు మొదలైనాయి. అలాగే వినియోగదారులు రియల్‌.కామ్ ద్వారా కూడా ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. సో బ్లూ మరియు సో వైట్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభించే ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి నార్జో 10A ధరల వివరాలు

రియల్‌మి నార్జో 10A ధరల వివరాలు

ఇండియాలో కేవలం ఒకే ఒక 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌లో విడుదల అయిన రియల్‌మి నార్జో 10A స్మార్ట్‌ఫోన్ యొక్క ధర 8,499 రూపాయలు. ఈ ఫోన్ ను కొనుగోలుదారులు సో బ్లూ మరియు సో వైట్ వంటి కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.

రియల్‌మి నార్జో 10A సేల్స్ ఆఫర్స్
 

రియల్‌మి నార్జో 10A సేల్స్ ఆఫర్స్

రియల్‌మి నార్జో 10A స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వ్యక్తుల కోసం ఫ్లిప్‌కార్ట్ కొన్ని అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్‌లోని ఆఫర్‌ల విషయానికి వస్తే ఏదైనా రూపే డెబిట్ కార్డు యొక్క మొదటి ప్రీపెయిడ్ లావాదేవీ మీద 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు మీద కూడా 5 శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది. అలాగే 3 నెలల నుండి 12 నెలల వరకు ఎటువంటి ఖర్చు లేని నో-కాస్ట్ EMI ఎంపికల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

 

Also Read: 3 నెలల వాలిడిటీతో జియో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే!Also Read: 3 నెలల వాలిడిటీతో జియో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే!

రియల్‌మి నార్జో 10A 6.5-అంగుళాల HD డిస్ప్లే

రియల్‌మి నార్జో 10A 6.5-అంగుళాల HD డిస్ప్లే

రియల్‌మి 10A స్మార్ట్ ఫోన్ యొక్క 6.5-అంగుళాల డిస్ప్లే హెచ్‌డి + రిజల్యూషన్ తో 720x1600 పిక్సెల్స్ పరిమాణంతో మరియు 89.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. అలాగే ఇది "మినీ-డ్రాప్" నాచ్ స్టైల్ వంటి ఫీచర్ లను కలిగి ఉన్నాయి. దీని యొక్క డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది స్పోర్ట్స్ మీడియాటెక్ హెలియో G70 SoC మరియు ఆండ్రాయిడ్ 10-ఆధారిత రియల్‌మి UI తో రన్ అవుతుంది.

రియల్‌మి నార్జో 10A ఫీల్డ్-ఆఫ్-వ్యూ కెమెరా సెటప్‌

రియల్‌మి నార్జో 10A ఫీల్డ్-ఆఫ్-వ్యూ కెమెరా సెటప్‌

రియల్‌మి 10A స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరాల విషయానికి వస్తే ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో f / 1.8 లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా 119 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందువైపు ఎఫ్ / 2.0 లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా ఉంది. ఈ సెల్ఫీ కెమెరా 30fps ఫ్రేమ్ రేట్ వద్ద HD (720p) వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. వెనుక కెమెరా సెటప్ ఫుల్ -హెచ్‌డి (1080p) వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.

రియల్‌మి నార్జో 10A సెన్సార్లు

రియల్‌మి నార్జో 10A సెన్సార్లు

రియల్‌మి నార్జో 10A ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G LTE, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ V5.0, GPS/ A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క సెన్సార్ల విషయంలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మద్దతుతో వస్తుంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 250GB వరకు విస్తరించవచ్చు.

Best Mobiles in India

English summary
Realme Narzo 10A Sale Live on Flipkart and Realme Website

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X