Realme Narzo 20, 7 Pro Sale: రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుకు సరైన సమయం....
ప్రముఖ చైనా సంస్థ ఇండియాలో గత వారం రియల్‌మి నార్జో 20 సిరీస్ విభాగంలో విడుదల చేసిన రియల్‌మి నార్జో 20 స్మార్ట్ ఫోన్ మరియు మిడ్-రేంజ్ విభాగంలో అద్భుతమైన ఫీచర్లు గల రియల్‌మి 7 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12PM గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు రియల్‌మి యొక్క వెబ్ సైట్ ద్వారా మొదలుకానున్నాయి. మీడియాటెక్ హెలియో G85 SoC మరియు 6,000mAh బ్యాటరీ ఫీచర్లు గల రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి నార్జో 20 ధరల వివరాలు
రియల్‌మి నార్జో 20 స్మార్ట్‌ఫోన్ ను ఇప్పుడు రెండు వేరియంట్‌లలో కొనుగోలు చెయవచ్చు. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.10,499 ధర వద్ద మరియు 6GB ర్యామ్ +128GB స్టోరేజ్ మోడల్ ను రూ.11,499 ధర వద్ద గ్లోరీ సిల్వర్ మరియు విక్టరీ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్ మరియు రియల్.కామ్ ద్వారా కొనుగోలు చెయవచ్చు.

రియల్‌మి 7ప్రో ధరల వివరాలు
రియల్‌మి 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ను ఇప్పుడు రెండు వేరియంట్ లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.19,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.21,999. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12PM గంటల నుంచి ఫ్లిప్కార్ట్ మరియు కంపెనీ యొక్క వెబ్ సైట్ ద్వారా మొదలుకానున్నాయి.

రియల్‌మి నార్జో 20 మీడియాటెక్ హెలియో G70 SoC
రియల్‌మి నార్జో 20 సిరీస్ లోని రియల్‌మి నార్జో 20 ఫోన్ ఫుల్-HD + రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంది. ఇది 480 నిట్స్ ప్రకాశం మరియు 20: 9 కారక నిష్పత్తితో, 90.5 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో కలిగి ఉంది. ఇది పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉండి ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది స్పోర్ట్స్ మీడియాటెక్ హెలియో G70 SoC మరియు ఆండ్రాయిడ్ 10-ఆధారిత రియల్‌మి UI తో రన్ అవుతుంది. అలాగే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆధారంగా రియల్‌మి UIలో రన్ అవుతుంది.

రియల్‌మి 7 ప్రో 120HZ టచ్ శాంప్లింగ్ రేటు డిస్ప్లే
రియల్‌మి 7 ప్రో అద్భుతమైన గేమింగ్ ప్రాసెసర్ కోసం సరికొత్త స్నాప్‌డ్రాగన్ 720 G SoC చిప్ సెట్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ యొక్క 6.4-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే 60HZ రిఫ్రెష్ రేట్ మరియు 120HZ టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్యానెల్ 20: 9 కారక నిష్పత్తితో, 480 నిట్స్ ప్రకాశం మరియు 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది.

రియల్‌మి నార్జో 65W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ బ్యాటరీ
రియల్‌మి నార్జో 20 స్మార్ట్‌ఫోన్ యొక్క ఫొటోగ్రఫీ విషయానికి వస్తే వెనుక భాగంలోని ట్రిపుల్-కెమెరా సెటప్‌లో ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ 119-డిగ్రీల అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ B&W పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది కేవలం 38 నిమిషాల్లో 0 నుండి 100 శాతం వరకు హ్యాండ్‌సెట్‌ను ఛార్జ్ చేస్తుంది అని కంపెనీ పేర్కొంది.

రియల్‌మి 7 ప్రో సోనీ IMX682 సెన్సార్ కెమెరా సెటప్
రియల్‌మి 7 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ మెయిన్ కెమెరా మరియు ఎఫ్ / 2.3 అల్ట్రావైడ్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. ఈ సెటప్‌లో B/W సెన్సార్‌తో 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందుభాగంలో F/ 2.0 లెన్స్ తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ కుడి వైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి.

రియల్‌మి నార్జో 20 యాక్సిలెరోమీటర్ సెన్సార్
రియల్‌మి నార్జో 20 ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ V5.0, GPS/ A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే ఫోన్ యొక్క సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది 64GB మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మద్దతుతో వస్తుంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 250GB వరకు విస్తరించవచ్చు.

రియల్‌మి 7 ప్రో 65W ఫాస్ట్ ఛార్జింగ్ 4500mAh బ్యాటరీ
రియల్‌మి 7 ప్రో ఫోన్ 4,500 mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ఇది 3-కార్డ్ లాట్‌కు మద్దతును ఇస్తూ ఆండ్రాయిడ్ 10 తో రన్ అవుతాయి. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. స్మార్ట్ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా వస్తుంది.


Click it and Unblock the Notifications








