Home
News

Realme Narzo 20A First Sale: రూ.8,000 బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లో బెస్ట్ ఛాయస్

ప్రముఖ చైనా సంస్థ గత వారం ఇండియాలో రియల్‌మి నార్జో 20 సిరీస్ లో భాగంగా మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో రియల్‌మి నార్జో 20A స్మార్ట్ ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12PM గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు రియల్‌మి యొక్క వెబ్ సైట్ ద్వారా మొదలుకానున్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరా, మీడియాటెక్ హెలియో G85 SoC మరియు 5,000mAh బ్యాటరీ ఫీచర్లతో రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభించే ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి నార్జో 20A ధరల వివరాలు

రియల్‌మి నార్జో 20A ధరల వివరాలు

రియల్‌మి నార్జో 20A ను ఇండియాలో రెండు వేరు వేరు వేరియంట్ లలో విడుదల చేసారు. ఇందులో 3GB RAM + 32GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.8,499 కాగా 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్‌ను రూ.9,499 ధర వద్ద నేటి నుంచి కంపెనీ విక్రయించనుంది.

 

రియల్‌మి నార్జో 20A స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 20A స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 20A స్మార్ట్‌ఫోన్‌ 6.5-అంగుళాల డిస్ప్లేను LCD స్క్రీన్‌తో హెచ్‌డి + రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ను 720x1,600 పిక్సెల్స్ పరిమాణంలో మరియు 89.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఫీచర్లతో కలిగి ఉంది. ఈ ఫోన్‌ క్వాల్‌కామ్ యొక్క మిడ్-రేంజ్ 11nm చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 625 SOC తో రన్ అవుతుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరిని మరింత విస్తరించవచ్చు. ఇది 5,000mAh అతి పెద్ద బ్యాటరీని స్టాండర్డ్ 10W పాస్ట్ ఛార్జర్‌తో ప్యాక్ చేయబడి ఉంటుంది.

 

రియల్‌మి నార్జో 20A కెమెరా సెటప్‌

రియల్‌మి నార్జో 20A కెమెరా సెటప్‌

రియల్‌మి నార్జో 20A స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఫొటోగ్రఫీ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో 2 మెగాపిక్సెల్ B&W లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో పాటు 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

రియల్‌మి నార్జో 20A కనెక్టివిటీ ఎంపికలు

రియల్‌మి నార్జో 20A కనెక్టివిటీ ఎంపికలు

రియల్‌మి నార్జో 20A ఫోన్‌ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ V5.0, GPS/ A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే ఫోన్ యొక్క సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Realme Narzo 20A Smartphone First Sale Start Today in India via Flipkart and Realme.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X