రియల్‌మి నార్జో 30 & 30 5G లాంచ్ మరో 7 రోజులలో!! ధరలు, సేల్స్...?

|

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇండియాలో జూన్ 24 న కొత్తగా తన ప్రొడెక్టులను విడుదల చేయనున్నది. భారతదేశంలో వీటిని వర్చువల్ ఈవెంట్‌ ద్వారా లాంచ్ చేయనున్నట్లు రియల్‌మి ఇండియా, యూరప్ CEO మాధవ్ శేత్ ధృవీకరించారు. ఈ కంపెనీ రెండు స్మార్ట్‌ఫోన్లను మరియు ఒక టీవీని విడుదల చేయనున్నట్లు మాధవ్ శేత్ చెప్పారు.

 

రియల్‌మి

32 అంగుళాల రియల్‌మి స్మార్ట్ ఫుల్-HD టీవీతో పాటు రియల్‌మి నార్జో 30, రియల్‌మి నార్జో 30 5G ఫోన్లు భారతదేశంలో లాంచ్ కానున్నాయి. అయితే ఇందులో రియల్‌మి నార్జో 30 ఇప్పటికే మేలో మలేషియాలో ప్రారంభమైంది. అలాగే అదే నెలలో రియల్‌మి నార్జో 30 5G యూరప్‌లో ప్రారంభమైంది. అయితే రియల్‌మి నార్జో 30 5G ఇండియా మోడల్ యూరప్‌లో లాంచ్ చేసిన మోడల్‌ కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మోడల్ ఇప్పటికే భారతీయ మార్కెట్లో లభ్యమయ్యే రియల్‌మి 8 5G కి సమానంగా ఉంటుంది.

 

 

Vivo V21e 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ లీక్ అయ్యాయి!! వివరాలు ఇవిగో...Vivo V21e 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ లీక్ అయ్యాయి!! వివరాలు ఇవిగో...

 

రియల్‌మి నార్జో 30, రియల్‌మి నార్జో 30 5G ఫోన్‌లు మరియు 32 అంగుళాల రియల్‌మి స్మార్ట్ ఫుల్-HD టీవీని భారతదేశంలో లాంచ్ చేస్తున్న విషయాన్ని CEO మాధవ్ శేత్ తన యొక్క ట్విట్టర్ అకౌంటులో నేడు ట్వీట్ చేశాడు. ఈ ఈవెంట్ లాంచ్ కార్యక్రమం జూన్ 24న మధ్యాహ్నం 12:30 గంటలకు IST లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ధర మరియు లభ్యత వివరాలు ప్రకటించబడతాయి. ఈ సిరీస్‌లో ప్రారంభించిన మొదటి ఫోన్‌లు ఇవి కావు. రియల్‌మి నార్జో 30 ప్రో, రియల్‌మి నార్జో 30A ఇప్పటికే ఫిబ్రవరిలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి.

రియల్‌మి నార్జో 30 & 30 5G లాంచ్ వివరాలు

రియల్‌మి నార్జో 30 & 30 5G లాంచ్ వివరాలు

రియల్‌మి నార్జో 30 మరియు రియల్‌మి నార్జో 30 5G పంచ్-హోల్ తో కూడిన డిస్ప్లేను కలిగి ఉండవచ్చని టీజర్లు సూచిస్తున్నాయి. అలాగే ఈ మోడల్ ఫోన్ల వెనుక కెమెరాలు కూడా ఇంతకు ముందు ప్రారంభించిన మోడళ్లకు సమానంగా ఉంటాయి. రియల్‌మి నార్జో 30 5G యొక్క ఫీచర్స్ యూరోపియన్ మోడల్ కంటే కొద్దిగా స్వల్పంగా సర్దుబాటులను కలిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు.

రియల్‌మి నార్జో 30 & 30 5G ధరల వివరాలు

రియల్‌మి నార్జో 30 & 30 5G ధరల వివరాలు

రియల్‌మి యొక్క రెండు ఫోన్‌లు వాటి ప్రపంచ ధరల మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. మలేషియాలో రియల్‌మి నార్జో 30 మోడల్ యొక్క 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఏకైక వేరియంట్ యొక్క ధర MYR 799 (సుమారు రూ.14,100) గా నిర్ణయించబడింది. ఐరోపాలో విడుదలైన రియల్‌మి నార్జో 30 5G యొక్క సింగిల్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర యూరో 219 (సుమారు రూ.19,400) ధర నిర్ణయించింది. 32-అంగుళాల రియల్‌మి స్మార్ట్ ఫుల్-హెచ్‌డి టీవీ విషయానికొస్తే ఇది అన్ని వైపులా సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంటుంది. దిగువన కొంచెం మందమైన నొక్కు నిర్మాణంను కలిగి ఉంటుంది.

రియల్‌మి నార్జో 30 5G స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 30 5G స్పెసిఫికేషన్స్

యూరప్‌లో లాంచ్ అయిన రియల్‌మి నార్జో 30 5G ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మి UI2.0తో రన్ అవుతుంది. ఇది 90HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1,080x2,400 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC చేత రన్ అవుతూ 4GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క యూరప్ మోడల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 18W క్విక్ ఛార్జ్‌కు మద్దతిచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి అందించింది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, వై-ఫై, బ్లూటూత్ V5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి.

రియల్‌మి నార్జో 30 స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 30 స్పెసిఫికేషన్స్

మలేషియాలో లాంచ్ అయిన రియల్‌మి నార్జో 30లో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1,080x2,400 పిక్సెల్స్) డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హెలియో G95 SoC తో రన్ అవుతూ 6GB LPDDR4x ర్యామ్‌తో మరియు 128GB UFS 2.1 స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ V5, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. అలాగే ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది 30W డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme Narzo 30 & 30 5G and 32-Inch Realme SmartTV India Launch Date Revealed on June 24: Expected Features, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X