Realme Narzo 30కి సంబందించిన వీడియో లీక్ వచ్చింది!! లాంచ్ డేట్, ధర, ​ఫీచర్స్ ఇవే...

|

రియల్‌మి నార్జో 30 స్మార్ట్‌ఫోన్ 2021 మే 18 న లాంచ్ కానున్నట్లు కంపెనీ తన యొక్క వెబ్‌లో వెల్లడించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో G95 SoC తో రానున్నట్లు అధికారికంగా ధృవీకరించబడింది. రియల్‌మి నార్జో 30 హ్యాండ్ యొక్క స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్లను వివరిస్తూ ఉండే వీడియోను ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైంది. రియల్‌మి సంస్థ నుంచి నార్జో 30 సిరీస్‌లో మూడవ మోడల్‌గా లభిస్తున్నది. ఇప్పటికే నార్జో 30A మరియు నార్జో 30 ప్రో 5Gలను సంస్థ విడుదల చేసింది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 90HZ డిస్‌ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉన్నట్లు పుకారులు గల ఈ ఫోన్ యొక్క లాంచ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి నార్జో 30 లాంచ్ డేట్

రియల్‌మి నార్జో 30 లాంచ్ డేట్

రియల్‌మి సంస్థ యొక్క మలేషియా వెబ్‌సైట్ లో దేశంలో రియల్‌మి నార్జో 30 ను విడుదల చేసిన తేదీని వెల్లడించింది. కంపెనీ సైట్‌లోని సమాచారం ప్రకారం రియల్‌మి నార్జో 30 ఫోన్ మే 18 న మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) MYT(ఉదయం 9:30 గంటలకు) ప్రారంభమవుతున్నట్లు చూపుతున్నది. రియల్‌మి సంస్థ యొక్క మలేషియా ఫేస్‌బుక్ పేజీలో మీడియాటెక్ హెలియో G95 Soc ఉనికిని నిర్ధారించే టీజర్‌ను కూడా పోస్ట్ చేసింది.

రియల్‌మి నార్జో 30 లాంచ్ వీడియో లీక్

రియల్‌మి నార్జో 30 లాంచ్ వీడియో లీక్

రియల్‌మి నార్జో 30కు సంబందించిన అధికారిక వివరాలతో పాటు యూట్యూబ్ ఛానల్ మార్క్ యోయో టెక్ రివ్యూ చేతుల మీదుగా ఈ వీడియోను పంచుకుంది. రియల్‌మి నార్జో 30 ఫోన్ యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్లను వివరిస్తూ ఏడు నిమిషాల వీడియోను కలిగి ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో నిలువు గీతపై బాణం లాంటి నమూనాతో ప్రత్యేకమైన డిజైన్‌ను చూపిస్తుంది. ఇది ఏప్రిల్‌లో యుఎస్ ఎఫ్‌సిసి సైట్‌లో చూసినదానికి సమానంగా ఉంది. దీనితో పాటుగా ఈ ఫోన్ లో హోల్-పంచ్ డిస్ప్లే మరియు సన్నని బెజల్స్ నిర్మాణం కూడా ఉన్నాయి.

రియల్‌మి నార్జో 30 స్పెసిఫికేషన్స్
 

రియల్‌మి నార్జో 30 స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 30 ఫోన్ 90HZ డిస్‌ప్లేను కలిగి ఉండి కనీసం 6GB ర్యామ్‌ మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుందని హ్యాండ్-ఆన్ వీడియో సూచిస్తుంది. ఇది 30W డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 5,000mAh బ్యాటరీతో కూడా ప్యాక్ చేయబడి ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా ఫోన్‌ వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే ఇది UI 2.0 తో ఆండ్రాయిడ్ 11 తో రన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో గల 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లేను 580 నిట్స్ ప్రకాశంతో అందించగలదని నివేదికలు సూచించాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉందని పుకారు ఉంది. ఇది 9.5mm మందంతో 185 గ్రాముల బరువును కలిగి ఉండవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme Narzo 30 Launch Date Revealed: Specs, Features and More Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X