Home
News

రియల్‌మి నార్జో 30 కొత్త స్మార్ట్‌ఫోన్‌ ధరలు, ఫీచర్స్ ఇవే!! ఓ లుక్ వేయండి

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మి ఇప్పటికే నార్జో-సిరీస్ లో నార్జో 30A మరియు నార్జో 30 ప్రో 5G లను విడుదల చేసి బలమైన లైనప్‌ను కలిగి ఉంది. అయితే నేడు ఈ కంపెనీ సరికొత్తగా రియల్‌మి నార్జో 30 ను విడుదల చేశారు. కొత్త రియల్‌మి ఫోన్ 90HZ డిస్‌ప్లేతో మరియు ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G95 SOC వంటి ఫీచర్లతో రావడమే కాకుండా స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ఇతర ముఖ్యాంశాలలో పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్, 30W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి నార్జో 30 ధరల వివరాలు

రియల్‌మి నార్జో 30 ధరల వివరాలు

రియల్‌మి నార్జో 30 స్మార్ట్‌ఫోన్‌ కేవలం ఒకే ఒక వేరియంట్ లో విడుదలైంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఒకే వేరియంట్ లో లభించే రియల్‌మి నార్జో 30 ఫోన్ యొక్క ధర MYR 799. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.14,100 గా నిర్ణయించబడింది. ఈ ఫోన్ రేసింగ్ బ్లూ మరియు రేసింగ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని మే 19 నుండి మలేషియాలో అమ్మకం కానుంది. భారతదేశంతో సహా ఇతర మార్కెట్లలో ఈ రియల్‌మి కొత్త ఫోన్ యొక్క లాంచ్ మరియు లభ్యత గురించి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

రియల్‌మి నార్జో 30 స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 30 స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 30 ఫోన్ మీడియాటెక్ హెలియో G95 SoC తో పాటు 6GB ర్యామ్‌ మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో జతచేయబడి ఉంది. ఇది 30W డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 5,000mAh బ్యాటరీతో కూడా ప్యాక్ చేయబడి ఉంది. అలాగే ఇది డ్యూయల్ సిమ్ (నానో) సిమ్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో రియల్‌మి యుఐ 2.0 తో రన్ అవుతుంది. ఇది 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తి మరియు 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 405pp పిక్సెల్ డెన్సిటీ మరియు 580 నిట్స్ గరిష్ట ప్రకాశంతో ఉన్నాయి.

రియల్‌మి నార్జో 30 ఆప్టిక్స్

రియల్‌మి నార్జో 30 యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్ తో 48 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్, ఎఫ్ / 2.4 లెన్స్ తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. వెనుక కెమెరా యొక్క సిస్టమ్ సూపర్ నైట్‌స్కేప్, అల్ట్రా 48MP మోడ్, పనోరమా, పోర్ట్రెయిట్ మోడ్, టైమ్-లాప్స్ ఫోటోగ్రఫి, HDR, అల్ట్రా మాక్రో, AI సీన్ రికగ్నిషన్ మరియు AI బ్యూటీ వంటి ఫీచర్లకు మద్దతును ఇస్తుంది. ఇది 4K / 30fps వీడియో రికార్డింగ్‌ను కూడా అందిస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f / 2.1 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి

రియల్‌మి సంస్థ నుండి వచ్చిన నార్జో 30 ఫోన్ 128GB UFS 2.1 స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇది మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించబడుతుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై 802.11 ac, బ్లూటూత్ V5, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo 30 New Smartphone Released: India Price, Specs, Features, India Launch Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X