Just In
- 14 min ago
Amazon ఫైర్ టీవీ స్టిక్ తో పాటు Gaming కంట్రోలర్ కూడా ! ఆఫర్ వివరాలు చూడండి.
- 43 min ago
ఇక అప్పటితో Windows 8.1 ఓఎస్ యూజర్లకు సపోర్ట్ ఉండదు!
- 2 hrs ago
తమ ఫోన్ల గురించి, తప్పుడు యాడ్ లు ప్రచారం చేసినందుకు రూ.75 కోట్లు జరిమానా !
- 17 hrs ago
భారత్‌లో Realme (Tech Life Watch R100) స్మార్ట్ వాచ్ విడుదల..
Don't Miss
- Sports
Venkatesh Iyer: ఓపెనర్‌గా అతనే సమర్థుడు: టీమిండియా మాజీ ప్లేయర్
- News
బొమ్మను పెళ్ళాడిన మహిళ; మరో బుజ్జిబొమ్మ సంతానంగా.. ఈ స్టోరీ చదివితే షాకవ్వటం పక్కా!!
- Automobiles
రైడింగ్‌కి మీరు సిద్దమేనా.. మార్కెట్లో కొత్త 'కవాసకి నింజా 400' విడుదలైంది: వివరాలు
- Movies
శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అలా అందాల కనువిందు!
- Lifestyle
Today Rasi Phalalu :ఓ రాశి వారు ఈరోజు వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి..!
- Finance
20,000 డాలర్లకు పైన బిట్ కాయిన్, 12000 డాలర్ల దిగువన ఎథేర్
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
Realme Narzo 50 సిరీస్ కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్ మి ఇండియాలో నేడు రియల్‌మి నార్జో 50 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో రియల్‌మి నార్జో 50 ప్రో 5G మరియు నార్జో 50 5G వంటి రెండు ఫోన్లు ఉన్నాయి. ఈ కొత్త రియల్‌మి నార్జో 50 సిరీస్ ఫోన్లు యువతను దృష్టిలో ఉంచుకొని డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తాయి. ఈ రెండు ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ SoC మరియు AMOLED స్క్రీన్‌తో 90Hz డిస్ప్లేలను కలిగి ఉంటాయి. దీని యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి నార్జో 50 సిరీస్ ధరల వివరాలు
రియల్‌మి సంస్థ నేడు భారతదేశంలో విడుదల చేసిన రియల్‌మి నార్జో 50 సిరీస్ ఫోన్లలో మొదటిది నార్జో 50 ప్రో 5G ఫోన్ రెండు వేరియంట్లలో విడుదలైంది. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.21,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.23,999. ఇది మే 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. మరొక కొత్త ఫోన్ రియల్‌మి నార్జో 50 5G కూడా మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.15,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 16,999 అయితే చివరిగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ రూ.17,999 ధర అయింది. దీని యొక్క మొదటి అమ్మకాలు మే 24 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభంకానున్నాయి. వీటి యొక్క లాంచ్ ఆఫర్లలో భాగంగా HDFC బ్యాంక్ కార్డ్‌లు మరియు EasyEMI ఎంపికలను ఉపయోగించే కస్టమర్లకు రూ.2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.

రియల్‌మి నార్జో 50 ప్రో స్పెసిఫికేషన్స్
రియల్‌మి నార్జో 50 ప్రో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 మరియు రియల్‌మి UI 3.0తో రన్ అవుతుంది. అలాగే 6.4-అంగుళాల ఫుల్-HD+ సూపర్ AMOLED డిస్ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 nits గరిష్ట ప్రకాశంతో పాటుగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో లభిస్తుంది. ఇది octa-core MediaTek Dimensity 920 SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB వరకు RAMతో జతచేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో f/1.79 లెన్స్ తో 48-మెగాపిక్సెల్ Samsung S5KGM1ST ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ షూటర్ మరియు మాక్రో షూటర్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీలను క్యాప్చర్ చేయడం మరియు వీడియో చాట్లను ఎనేబుల్ చేయడం కోసం ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

రియల్‌మి నార్జో 50 ప్రో 5G ఫోన్ లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఇందులో హార్ట్ రేట్ సెన్సార్ కూడా ఉంటుంది. మరియు స్టాండర్డ్‌గా 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. చివరిగా 33W డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఫోన్లో డాల్బీ అట్మోస్‌తో జత చేయబడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

రియల్‌మి నార్జో 50 5G స్పెసిఫికేషన్స్
రియల్‌మి నార్జో 50 5G యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 మరియు రియల్‌మి UI 3.0తో రన్ అవుతుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లేను 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో మరియు గరిష్టంగా 600 నిట్ల బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంటుంది. హుడ్ కింద మాలి-G57 MC2 GPUతో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoCతో రన్ అవుతూ 6GB LPDDR4x RAM తో జతచేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇది వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్‌తో పాటు f/1.8 లెన్స్‌తో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ లను కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్ డ్యూయల్-LED ఫ్లాష్‌తో జత చేయబడింది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో f/2.0 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999