రియల్‌మి నార్జో 50 సిరీస్‌ ఇండియాలో వచ్చే వారం లాంచ్ కానున్నది!! ధర ఎంతనో తెలుసా??

|

రియల్‌మి చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మి నార్జో 30 సిరీస్ లాంచ్ తరువాత తన తదుపరి నార్జో-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను రియల్‌మి నార్జో 50 సిరీస్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. రియల్‌మి నార్జో 50A ఫోన్ గురించి చాలా కాలంగా పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుత కొత్త లీకులలో రియల్‌మి నార్జో 50 సిరీస్ భారతదేశంలో సెప్టెంబర్ 20 మరియు 24 మధ్య లాంచ్ అవుతుందని సూచిస్తున్నాయి. ఈ విషయాన్ని రియల్‌మి ఇండియా మరియు యూరోప్ యొక్క CMO ఫ్రాన్సిస్ వాంగ్ కూడా ధృవీకరించారు. అంతేకాకుండా రాబోయే హ్యాండ్‌సెట్ రియల్‌మి నార్జో 50A యొక్క అంతర్గత హార్డ్‌వేర్ వివరాలను ట్వీట్‌ ద్వారా షేర్ చేసారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి నార్జో 50 సిరీస్‌ లాంచ్ డేట్

రియల్‌మి నార్జో 50 సిరీస్‌ లాంచ్ డేట్

కొన్ని ఆన్ లైన్ నివేదికల ప్రకారం రియల్‌మి సెప్టెంబర్ 20 మరియు 24 మధ్య రియల్‌మి నార్జో 50 సిరీస్‌ను భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ కొత్త పరికరాలు 4G మరియు 5G రెండు వేరియంట్లలో లాంచ్ అవుతాయని నివేదించబడింది. ఊహాజనిత నార్జో 50i కూడా దీనితో పాటు ప్రారంభమవుతుందని తెలియజేయడమైంది. రియల్‌మి రెండు AIoT ఉత్పత్తులను కూడా ప్రవేశపెడుతుందని నివేదిక జతచేస్తుంది. ఈ రెండు ఉత్పత్తులలో ఒకటి రియల్‌మి బ్యాండ్ 2 కావచ్చు. ఇది రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో విక్రయించబడనున్నట్లు సమాచారం. రెండవ AIoT ఉత్పత్తి గురించి ఎటువంటి వివరాలు ఇంకా అందుబాటులో లేవు. అయితే ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించిన రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ అని ఊహించుకుంటున్నారు.

Realme Dizo స్మార్ట్‌వాచ్‌లు లాంచ్ అయ్యాయి!! ధర కూడా తక్కువే...Realme Dizo స్మార్ట్‌వాచ్‌లు లాంచ్ అయ్యాయి!! ధర కూడా తక్కువే...

రియల్‌మి నార్జో 50 సిరీస్‌ ధరల వివరాలు
 

రియల్‌మి నార్జో 50 సిరీస్‌ ధరల వివరాలు

వాంగ్ ఇప్పటికే తన తాజా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్వీట్ ద్వారా దేశంలో నార్జో 50A లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నార్జో 50 సిరీస్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మీడియాటెక్ హీలియో G85 SoCతో రన్ అవుతుంది. ఈ కొత్త ఫోన్ ప్రస్తుతమున్న నార్జో 30A కంటే విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఇది భారతదేశంలో రూ.8,999 ప్రారంభ ధర వద్ద బేస్ 3GB RAM మరియు 32GB స్టోరేజ్ మోడల్ అందుబాటులో ఉంది. అధిక వేరియంట్ 4GB RAM మరియు 64GB స్టోరేజీని రూ.9,999. భారతదేశంలో నార్జో 50 ఎ ధర దాదాపు ఒకే విధంగా ఉంటుందని మనం ఆశించవచ్చు.

రియల్‌మి నార్జో 50A స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 50A స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్ విభాగం విషయానికి వస్తే రియల్‌మి 50A ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుందని గత లీకులు సూచిస్తున్నాయి. అలాగే రియల్‌మి నార్జో 50A నాచ్డ్ డిస్‌ప్లేతో లభిస్తూ దిగువన USB టైప్-సి పోర్ట్‌తో పాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ని కలిగి ఉంటుంది. ఇంతకుముందు రియల్‌మి నార్జో 50A బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) మరియు థాయ్‌లాండ్ యొక్క నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్ (NBTC) జాబితాలలో మోడల్ నంబర్ RMX3430 లో కనిపించింది. అదే మోడల్ నంబర్‌తో కూడిన రియల్‌మీ ఫోన్ కూడా Camerafv5.com డేటాబేస్‌లో కనిపించింది. ఈ ఫోన్ 13-మెగాపిక్సెల్ (డేటాబేస్‌లో 12.5-మెగాపిక్సెల్) సెన్సార్ మరియు 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంటుందని సూచించింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme Narzo 50 Series is Set to Launch in India Next Week: Features Leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X