రియల్‌మి నార్జో 50 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

|

ప్రపంచంలో ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో రోజు రోజుకి పోటీ విపరీతంగా పెరుగుతున్నది. పోటీలో అనేక సంస్థలు తమ యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్లను ఎప్పటికప్పుడు మార్కెట్ లో విడుదల చేస్తున్నాయి. నేడు రియల్‌మి సంస్థ భారతదేశంలో రియల్‌మి నార్జో 50 మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఇది మీడియా టెక్ హీలియో G96 SoC ద్వారా రన్ అవుతూ 6.6-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 600 nits గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఇది సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ డైనమిక్ ర్యామ్ విస్తరణ మద్దతును కలిగి ఉండి ఫ్రీ స్టోరేజ్ ను వర్చువల్ మెమరీగా ఉపయోగించుకుంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి  నార్జో 50 ధరలు & లభ్యత వివరాలు

రియల్‌మి నార్జో 50 ధరలు & లభ్యత వివరాలు

భారతదేశంలో రియల్‌మి నార్జో 50 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.12,999 కాగా 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499. ఈ స్మార్ట్‌ఫోన్ స్పీడ్ బ్లాక్ మరియు స్పీడ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది మార్చి 3 మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్ మరియు కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ మరియు రిటైల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయడానికి మొదటిసారి అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి  నార్జో 50 స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 50 స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 50 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 మరియు కంపెనీ రియల్‌మి UI 2.0 పైన రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) IPS LCDని కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హీలియో G96 SoC ద్వారా రన్ అవుతూ 6GB వరకు RAMతో జత చేయబడి ఉంది. ఇది వర్చువల్ మెమరీగా ఉపయోగించని లేదా ఉచిత స్టోరేజ్ ను ఉపయోగించడం ద్వారా అందుబాటులో ఉన్న మెమరీని 11GB వరకు విస్తరించడానికి హ్యాండ్‌సెట్ డైనమిక్ RAM విస్తరణ ఫీచర్‌ను కూడా అందిస్తుంది.

ఆప్టిక్స్
 

రియల్‌మి నార్జో 50 యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అమర్చబడి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 128GB వరకు స్టోరేజీని అందిస్తుంది. దీనిని మైక్రో SD (256GB వరకు) కార్డ్ ద్వారా ప్రత్యేక స్లాట్ ద్వారా విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ మరియు GPS ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 33W సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో రన్ అవుతూ ఉంది.

Best Mobiles in India

English summary
Realme Narzo 50 Smartphone Released in India With MediaTek Helio G96 SoC: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X