Realme Narzo 50A Prime స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ లో రూ.1500 వరకు డిస్కౌంట్ ఆఫర్లు...
భారతదేశంలో రియల్‌మి స్మార్ట్‌ఫోన్ కంపెనీ గత వరం నార్జో లైనప్‌లో కొత్తగా రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ ను ప్రారంభించింది. ఈ సరికొత్త ఫోన్ ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి సంస్థ శుభవార్తను తెలుపుతూ అమెజాన్ మరియు కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ మరియు రిటైల్ స్టోర్‌ల ద్వారా మొదటి సేల్స్ ని ప్రారంభించింది. ఆక్టా-కోర్ యునిసోక్ T612 ప్రాసెసర్, 4GB RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Realme Narzo 50A ప్రైమ్ ధరలు & సేల్స్ ఆఫర్ వివరాలు
రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ యొక్క సేల్స్ లో రెండు వేరియంట్ లలో లభిస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ మోడల్ ను రూ.11,499 ధర వద్ద మరియు 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,499 ధర వద్ద ఫ్లాష్ బ్లాక్ మరియు ఫ్లాష్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అమెజాన్ లో కొనుగోలు చేయాలని చూస్తున్న వారు డిస్కౌంట్లను పొందవచ్చు. ముఖ్యంగా HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగిన వారు రూ.1500 వరకు తగ్గింపును పొందుతారు.

Realme Narzo 50A ప్రైమ్ స్పెసిఫికేషన్స్
రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్11-ఆధారిత రియల్‌మి UI R ఎడిషన్‌తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లేని కలిగి ఉంది. ఇది 2,408x1,080 పిక్సెల్‌ల LCD స్క్రీన్‌ను 600 nits గరిష్ట ప్రకాశంతో మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఇది 12nm ఆక్టా-కోర్ Unisoc T612 SoC ప్రాసెసర్ మరియు 4GB LPDDR4x RAMతో జత చేయబడిన ARM Mali-G57 GPU ద్వారా శక్తిని పొందుతుంది.

రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 ఎపర్చరు లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.8 ఎపర్చరుతో మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్ తో కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.0 ఎపర్చరు లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ AI సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ కొత్త ఫోన్ 128GB వరకు ఇన్‌బిల్ట్ UFS 2.2 స్టోరేజీని అందిస్తుంది. దీనిని ప్రత్యేక మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5, GPS/ A-GPS, 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లోని సెన్సార్‌లలో లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.


Click it and Unblock the Notifications