Home
News

Realme Narzo 50A Prime స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్, సేల్స్ వివరాలు

రియల్‌మి స్మార్ట్‌ఫోన్ కంపెనీ నార్జో లైనప్‌కి జోడింపుగా నేడు కొత్తగా రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ ను భారతదేశంలో ప్రారంభించింది. ఈ సరికొత్త ఫోన్ హుడ్ కింద ఆక్టా-కోర్ యునిసోక్ T612 ప్రాసెసర్‌తో శక్తిని పొందుతూ 4GB RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఈ హ్యాండ్‌సెట్ 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Realme Narzo 50A ప్రైమ్ ధర & లభ్యత వివరాలు

Realme Narzo 50A ప్రైమ్ ధర & లభ్యత వివరాలు

భారతదేశంలో రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ మోడల్ యొక్క ధర రూ.11,499 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.12,499. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లాష్ బ్లాక్ మరియు ఫ్లాష్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది అమెజాన్ మరియు కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ మరియు రిటైల్ స్టోర్‌ల ద్వారా ఏప్రిల్ 28 నుండి మొదటిసారి కొనుగోలు చేయడానికి విక్రయించనున్నది.

Realme Narzo 50A ప్రైమ్ స్పెసిఫికేషన్స్

Realme Narzo 50A ప్రైమ్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్11-ఆధారిత రియల్‌మి UI R ఎడిషన్‌తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లేని కలిగి ఉంది. ఇది 2,408x1,080 పిక్సెల్‌ల LCD స్క్రీన్‌ను 600 nits గరిష్ట ప్రకాశంతో మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఇది 12nm ఆక్టా-కోర్ Unisoc T612 SoC ప్రాసెసర్ మరియు 4GB LPDDR4x RAMతో జత చేయబడిన ARM Mali-G57 GPU ద్వారా శక్తిని పొందుతుంది.

ఆప్టిక్స్

రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 ఎపర్చరు లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.8 ఎపర్చరుతో మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్ తో కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.0 ఎపర్చరు లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ AI సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ కొత్త ఫోన్ 128GB వరకు ఇన్‌బిల్ట్ UFS 2.2 స్టోరేజీని అందిస్తుంది. దీనిని ప్రత్యేక మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5, GPS/ A-GPS, 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లోని సెన్సార్‌లలో లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ 18W పాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Realme Narzo 50A Prime Smartphone Launched in India With Octa-Core Unisoc T612 Processor: Price, Specs, Sale Date, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X