Home
News

Realme నుంచి మరో కొత్త ఫోన్‌ Narzo 60 5G.. డిజైన్‌, ఫీచర్ల వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. Realme Norzo 60 5G పేరిట స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ తాజాగా గ్రీక్‌బెంచ్‌లో RMX3750 మోడల్‌ నంబర్‌తో గుర్తించడంతో విడుదలకు సిద్ధం అయిందని భావిస్తున్నారు. రియల్‌మీ నార్జో 60 రియల్‌మీ 11 5G స్మార్ట్‌ఫోన్‌కు రీబాడ్జట్‌ వెర్షన్‌గా రానున్నట్లు తెలుస్తోంది.

గ్రీక్‌బెంచ్‌ సింగిల్‌ కోర్‌, మల్టీ కోర్‌ పరీక్షల్లో రియల్‌మీ నార్జో 60 5G స్మార్ట్‌ఫోన్‌ 1868 పాయింట్లకు గాను 714 సాధించినట్లు తెలుస్తోంది. రియల్‌మీ 60 5G స్మార్ట్‌ఫోన్‌ను 4GB, 6GB ర్యామ్‌, 64GB, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 రియల్‌మీ UI 4.0పై ఆధారపడి పనిచేయనుందని భావిస్తున్నారు.

realme narzo 60 5G

రియల్‌మీ నార్జో 60 5G 6.43 అంగుళాల పుల్‌హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే (2400*1080 పిక్సల్‌)తో వచ్చే అవకాశం ఉంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉండనుంది. ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరా 64MP ప్రైమరీ కెమెరా, 2MP మెక్రో కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ముందువైపు 8MP కెమెరాను వినియోగించినట్లు సమాచారం.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీ సామర్థ్యం మరియు 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రానుందని తెలుస్తోంది. మరియు డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉండనుంది. USB టైప్‌ C పోర్ట్‌, మరియు డెడికేటెడ్‌ మైక్రోఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌ను కలిగి ఉండనున్నట్లు సమాచారం.

* రియల్‌మీ 11 ప్రో+ : రియల్‌మీ సంస్థ తన తాజా ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ Realme 11 Pro+ 5G.. జూన్‌ 15 నుంచి భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. 200MP కెమెరాతో 4X లాస్‌లెస్‌ జూమ్‌ మరియు ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ఫీచర్‌తో లాంచ్‌ అయింది. మరియ ఈ ఫోన్‌ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మీ 11 ప్రో+ 4X లాస్‌లెస్‌ జూమ్‌, 2X పోర్ట్రెయిట్‌ మోడ్ మరియు ఆటో జూమ్‌ టెక్నాలజీ ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పోటీలో ముందుంటుంది. 200MP డైరెక్ట్‌ అవుట్‌పుట్‌ మరియు స్ట్రీట్‌ ఫోటోగ్రఫీ మోడ్‌, సూపర్‌ OIS, నైట్‌ మోడ్‌ విత్‌ సార్రి స్కై మోడ్‌, మూన్‌ మోడ్‌ మరియు సూపర్‌ నైట్‌స్కేప్‌ వంటి సృజనాత్మక కెమెరాల మోడ్‌లను ఈ ఫోన్‌ సపోర్టు చేస్తుంది.

రియల్‌మీ 11 ప్రో+ 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ ఎంపికల్లో వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 5000mAh బ్యాటరీను కలిగి ఉంది. 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 26 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ చేయగలదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Realme Narzo 60 5G Smartphone may launch in india soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X