Home
News

12GB ర్యామ్‌, 100MP కెమెరా రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్‌.. ధర, సేల్‌ వివరాలు..!

రియల్‌మి నార్జో 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme Narzo 60 Pro Smartphone) గత సంవత్సరం భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌.. ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరను పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే సహా OIS సపోర్టుతో 100MP కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి నార్జో 60 ప్రో ధరలు : అమెజాన్‌లో రియల్‌మి నార్జో 60 ప్రో 8GB ర్యామ్‌+128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.23999గా ఉంది. అన్ని బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తక్షణ తగ్గింపును పొందుతారు. నో కాస్ట్‌ ఈఎంఐ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

reamle-narzo-60-pro-smartphone offer

అదే రియల్‌మి నార్జో 60 ప్రో హ్యాండ్‌సెట్‌ 12GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.26,999గా ఉంది. కూపన్‌ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.4000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్లు, నో కాస్ట్‌ ఈఎంఐ ప్రయోజనాలకు కూడా పొందవచ్చు. మార్స్‌ ఆరెంజ్‌, కాస్మిక్‌ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి నార్జో 60 ప్రో స్పెసిఫికేషన్లు..
రియల్‌మి నార్జో 60 ప్రో 6.7 అంగుళాల పుల్‌ HD+ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మి UI 4.0 OS పైన పనిచేస్తుంది. 6nm డైమెన్సిటి 7050 CPU మరియు Mail G68 GPU పైన పనిచేస్తుంది.

reamle-narzo-60-pro-smartphone offer

రియల్‌మీ నార్జో 60 ప్రో హ్యాండ్‌సెట్‌ 67W సూపర్‌వూక్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కెమెరాల పరంగా వెనుక 100MP ప్రధాన కెమెరా, 2MP పోర్ట్రెయిట్‌ లెన్స్‌ను కలిగి ఉంది. వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం ముందువైపు 16MP కెమెరాను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా రియల్‌మి నార్జో 60 ప్రో స్మార్ట్‌ఫోన్ వైపై 6, బ్లూటూత్‌ 5.2, డేటా ట్రాన్స్‌ఫర్‌, ఛార్జింగ్‌ కోసం USB-C పోర్టును కలిగి ఉంటుంది. మరియు డాల్బీ అట్మాస్‌ ఆధారిత డ్యూయల్‌ స్పీకర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్లు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

* అలాగే ఇటీవల భారత్‌లో విడుదలైన రియల్‌మి 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్ పైన ఫ్లిప్‌కార్ట్‌ ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రియల్‌మీ 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.31,999గా ఉంది.

రియల్‌మి 12 ప్రో+ 12GB ర్యామ్‌+ 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.33,999 గా ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ఆఫర్‌ కింద రూ.4000 తగ్గింపును పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Reamle Narzo 60 Pro Smartphone gets huge price discount in Amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X