Home
News

100MP కెమెరా, 1TB స్టోరేజీతో Realme కొత్త ఫోన్ విడుదల.. ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ ఇవాళ రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. Realme Narzo 60 5G మరియు Realme Narzo 60 Pro 5G ఫోన్లను లాంచ్‌ చేసింది. రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా మీడియాటెక్‌ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో రానున్నాయి.

రియల్‌మీ నార్జో 60 5G స్మార్ట్‌ఫోన్‌ కాస్మిక్‌ బ్లాక్‌, మార్స్‌ ఆరెంజ్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అదే ప్రో మోడల్‌ కాస్మిక్ నైట్‌, మార్టైన్‌ సన్‌రైజ్‌ రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు ఫోన్లను అమెజాన్‌ నుంచి ముందస్తుగా బుకింగ్‌ చేసుకోవచ్చు.

Realme launched Narzo 60 series smartphone

రియల్‌మీ నార్జో 60 స్మార్ట్‌ఫోన్‌ 6.43 అంగుళాల పుల్‌ హెచ్‌డీ+ (2400*1080 పిక్సల్‌) సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో రానుంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇన్‌స్టంట్‌ శాంప్లింగ్‌ రేట్‌ 1000Hz, 1000 nits గరిష్ట బ్రైట్‌నెస్‌ లెవల్‌తో వస్తుంది. మరియు పిక్సల్ డెన్సిటీ 409ppiగా ఉంటుంది.

నార్జో 60 ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ UI 4.0 ఆధారంగా పనిచేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6020 SoCతో వస్తుంది. రియల్‌మీ నార్జో 60 5G స్మార్ట్‌ ఫోన్ 64MP ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 33W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో రానుంది. రియల్‌మీ నార్జో 60 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.17,999 మరియు 8GB ర్యామ్, 256 స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.19,999కు సొంతం చేసుకోవచ్చు.

Realme launched Narzo 60 series smartphone

రియల్‌మీ నార్జో 60 ప్రో 5G ఫోన్‌ పుల్‌ హెచ్‌డీ+ (2400*1080 పిక్సల్‌) సూపర్ అమోలెడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 61 డిగ్రీల ప్రిసిసన్‌ కర్వేచర్‌ రేట్, 1260Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ UI 4.0 ఆధారంగా ఫోన్‌ పనిచేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 5G SoCతో 1TB అంతర్గత స్టోరేజీతో వస్తుంది.

12GB ఫిజికల్‌ ర్యామ్‌, 12GB డైనమిక్ ర్యామ్‌ను కలిగి ఉంటుంది. 1TB అంతర్గత స్టోరేజీ కలిగిన ఫోన్‌గా గుర్తించబడుతుంది. నార్జో 60 ప్రో 5G ఫోన్‌ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన 100MP ప్రైమరీ కెమెరా, 2MP సెన్సార్‌తో ఆటో జూమ్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఫ్రంట్‌ కెమెరా 16MP సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 67W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

రియల్‌మీ నార్జో 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 మరియు 12GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999. 12GB ర్యామ్‌, 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.29,999కు అందుబాటులో ఉంది.

రెండు ఫోన్లను ఇవాళ్టి నుంచి ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు. రియల్‌మీ నార్జో 60 5G ఫోన్‌ను SBI, ICICI క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసినట్లయితే 1000 రూపాయల తగ్గింపును పొందుతారు. అదే రియల్‌మీ నార్జో 60 ప్రో 5G ఫోన్ ముందస్తు బుకింగ్‌పై రూ.1500 తగ్గింపును పొందుతారు. జులై 15 తేది 12 AM గంటలకు ప్రారంభం కానున్న ప్రైమ్‌డే సేల్ 2023లో రెండు ఫోన్లు అందుబాటులో ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme launched narzo 60 series smartphones in india with 1TB internal storage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X