Home
News

100MP కెమెరాతో Realme Narzo 60 స్మార్ట్‌ఫోన్‌ సీరిస్..! జులై 6న విడుదల..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ కానున్నాయి. Realme Narzo 60 సీరిస్‌ ఫోన్లను జులై 6న విడుదల చేస్తామని రియల్‌మీ అధికారికంగా వెల్లడించింది. జులై 6న 12PM గంటలకు లాంచ్‌ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతోపాటు నార్జో ఫోన్‌ సీరిస్‌ డిజైన్‌ వివరాలపై స్పందించింది.

రియల్‌మీ నార్జో 60 సీరిస్‌లో రెండు స్మార్ట్‌ ఫోన్లు.. నార్జో 60, నార్జో 60 ప్రో విడుదల కానున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు వెనుక వైపు 100MP ప్రధాన ‌కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉండనుందని తెలుస్తోంది. మరియు ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.

Realme Narzo 60

రియల్‌మీ నార్జో 60 సీరిస్‌ ఫోన్లు 6.43 అంగుళాల పుల్‌ హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో రానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్లు మీడియాటెక్‌ డైమెన్సిటీ 6020 ప్రొసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 13తో కూడిన రియల్‌మీ UI 4.0పై ఆధారపడి పనిచేస్తుందని సమాచారం.

రియల్‌మీ నార్జో 60 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌తో 1TB వరకు అంతర్గత స్టోరేజీ పెంచుకొనేందుకు వీలుంటుందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌పై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. నార్జో 60 ఫోన్‌ 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో రానుందని సమాచారం.

రియల్‌మీ నార్జో 60 సీరిస్‌ ఫోన్ల డిజైన్‌.. ఇటీవల విడుదలైన రియల్‌మీ 11 ప్రో సీరిస్‌ మాదిరిగా ఉంది. రియల్‌మీ మైక్రోసైట్‌ ప్రకారం నార్జో 60 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు సన్నసి బెజెల్‌ వంపుతో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ముందువైపు పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. వాల్యూమ్‌ బటన్లు కుడి వైపున ఉన్నాయని తెలుస్తోంది.

అయితే ఈ రెండు ఫోన్లు ధర ఎంత ఉంటుందనే అంశంపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. రియల్‌మీ నార్జో 60 మరియు నార్జో 60 ప్రో స్మార్ట్‌ఫోన్లు ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో జులై 6 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

* రియల్‌మీ 11 ప్రో ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. మరియు 200MP+8MP+2MP వెనుక కెమెరాలు, ముందువైపు 32MP కెమెరాలను కలిగి ఉంది. 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 8GB ర్యామ్‌ మరియు 256GB అంతర్గత స్టోరేజీ ధర ప్రస్తుతం రూ.27,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Realme Narzo 60 series smartphones will launch on july 6 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X