Realme నుంచి కొత్త ఫోన్ Realme Narzo 70 5G లాంచ్ రేపే! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
రియల్‌మి సంస్థ Realme Narzo 70 5G స్మార్ట్‌ఫోన్‌ను రేపు అంటే ఏప్రిల్ 24 న భారతదేశంలో లాంచ్ చేస్తుందని కంపెనీ రూపొందించిన మైక్రోసైట్ వెల్లడించింది. ఈ మైక్రోసైట్ రాబోయే నార్జో సిరీస్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్‌లు మరియు ధర పరిధిని కూడా వివరిస్తుంది.
వీటిలో అమోలెడ్ డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ మరియు థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఆవిరి చాంబర్ కూడా ఉన్నాయి. Realme Narzo 70 5G స్మార్ట్‌ఫోన్ Realme Narzo 60 5G కి కొనసాగింపుగా వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది.

భారతదేశంలో రియల్‌మి నార్జో 70 5G లాంచ్ ఏప్రిల్ 24న మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని అధికారిక మైక్రోసైట్ చూపుతోంది. Realme Narzo 70x 5G కూడా అదే లాంచ్ ఈవెంట్‌లో లాంచ్ చేయబడుతుంది. Realme Narzo 70 5G ధర రూ.15,000 లోపుగా నిర్ధారించబడింది. అయితే నార్జో 70x 5G ధర రూ. 12,000 లోపు ఉండవచ్చని అంచనాలున్నాయి.
లాంచ్ షెడ్యూల్ మరియు ధరల శ్రేణి మాత్రమే కాక, రియల్‌మి సంస్థ సృష్టించిన ఈ మైక్రోసైట్ రియల్‌మి నార్జో 70 5G యొక్క కొన్ని ముఖ్య స్పెసిఫికేషన్‌లను హైలైట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంటుందని మరియు హుడ్ కింద మీడియా టెక్ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్ పై రన్ అవుతుందని ఇది చూపిస్తుంది. ఇది శీతలీకరణ కోసం 4,356mm చదరపు ఆవిరి చాంబర్ వ్యవస్థను కలిగి ఉంది.
రియల్‌మి నార్జో 70 5G ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. మైక్రోసైట్‌లో ప్రదర్శించబడిన చిత్రాలు హ్యాండ్‌సెట్‌లో గుండ్రని ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను సూచిస్తున్నాయి.
మైక్రోసైట్‌లో ఇవ్వబడిన రియల్‌మి నార్జో 70 5G స్పెసిఫికేషన్ల జాబితా, రియల్‌మి నార్జో 60 5G ఫోన్ కు అప్‌గ్రేడ్‌లతో కొత్త సరసమైన పోటీదారుగా వస్తుందని చూపిస్తుంది. గత ఏడాది జూలైలో లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.17,999 గా ఉంది.
రియల్‌మి గత నెలలో రియల్‌మి నార్జో 70 ప్రో 5G ని రూ. 18,999 కి లాంచ్ చేసింది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్ పై పనిచేస్తుంది. మరియు 67W వైర్ సూపర్ ఊక్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 2400*1080 పిక్సల్ రిజల్యూషన్‌తో కూడిన 6.67 అంగుళాల పుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ సహా 2200Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. గ్లాస్ డిజైన్, ఎయిర్ గెశ్చర్ వంటి ప్రత్యేక ఫీచర్లతో లాంచ్ అయింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








