బడ్జెట్ రేంజ్‌లో కర్వడ్ డిస్‌ప్లేతో రియల్‌మి ఫోన్.. స్టోరేజీ, కలర్ వేరియంట్స్, విడుదల వివరాలు లీక్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి భారత్ మార్కెట్‌లోకి త్వరలో నార్జో 70 సిరీస్ కొత్త మోడల్ విడుదల కానున్నాట్లు తెలుస్తోంది. రియల్‌మి నార్జో 70 కర్వ్ (Realme Narzo 70 Curve Smartphone) పేరుతో లాంచ్ కానున్నట్లు సమాచారం. గతంలో వచ్చిన వివరాలు మరియు హ్యాండ్‌సెట్ పేరు ఆధారంగా కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. తాజా వివరాల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ ఆఖరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రియల్‌మి నార్జో 70 కర్వ్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. తాజాగా ఈ కర్వ్ స్మార్ట్‌ఫోన్ ర్యామ్, స్టోరేజీ, కలర్ వేరియంట్‌ల వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ధర భారత్ మార్కెట్‌లో రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

91మొబైల్స్ సమాచారం అధారంగా రియల్‌మి నార్జో 70 కర్వ్ స్మార్ట్‌ఫోన్ నాలుగు స్టోరేజీ వేరియంట్స్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో లభించే అవకాశం ఉంది.
దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. డీప్ వైలెట్, డీప్ స్పేస్ టైటానియం రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన రియల్‌మి నార్జో 70 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌లతోనే అందుబాటులోకి వచ్చాయి. కర్వ్ హ్యాండ్‌సెట్ కూడా ఈ తరహా చిప్‌సెట్‌తో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
రియల్‌మి నార్జ్ 70 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5G SoC చిప్‌సెట్, నార్జో 70X వేరియంట్.. మీడియాటెక్ 6100+ SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అదే నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC చిప్‌సెట్, నార్జో 70 టర్బో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
దీంతోపాటు నార్జో 70 సిరీస్ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తున్నాయి. డిసెంబర్ 2024 లో విడుదల కానుందని అంచనా వేస్తున్న రియల్‌మి నార్జో 70 కర్వ్ స్మార్ట్‌ఫోన్ ఇదే తరహా కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్‌లతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
దీంతోపాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రియల్‌మి నార్జో 70, నార్జో 70 ప్రో, నార్జో 70 టర్బో స్మార్ట్‌ఫోన్‌లు.. 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. అయితే నార్జో 70X స్మార్ట్‌ఫోన్ మాత్రం 6.72 అంగుళాల డిస్‌ప్లేతో విడుదల అయింది. అయితే నార్జో 70 కర్వ వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవలే రియల్‌మి నుంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి GT 7 ప్రో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.59,999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. నిన్నటి నుంచి భారత్ మార్కెట్‌లో సేల్ ప్రారంభం అయింది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల FHD+ LTPO అమోలెడ్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 50MP+ 50MP+ 8MP + 16MP (సెల్ఫీ) కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 8 Elite SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 120W ఛార్జింగ్ సపోర్టుత 5800mAh బ్యాటరీతో పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications